పోక్సో కేసులో ఇరుక్కుని తప్పుచేయలేదని బుకాయిస్తున్న బండి భగీరథ్‌కు ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనబడుతోంది. బెయిల్ నిరాకరణతో ప్రస్తుతం భగీరథ్ చంచల్ గూడ్ జైల్లో ఉన్నాడు.
16వ తేదీ రాత్రి నిందితుడికి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నవిషయంలో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్నతర్వాత భగీరథ్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది. దాంతో నిందితుడిని పోలీసులు 14 రోజుల రిమాండుకు తరలించారు. ఇపుడు తాజా కబురు అంటే సోమవారం కొన్ని డెవలప్మెంట్లు జరిగాయి. అవేమిటంటే భగీరథ్ ఫోన్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి డిలిట్ చేసిన సమాచారం మొత్తాన్ని రిట్రీవ్ చేస్తున్నారు. అలాగే భగీరథ్-మైనర్ బాలిక మధ్య వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ లో జరిగిన మెసేజీలన్నింటినీ బయటకు తీస్తున్నారు.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నానక్ రామ్ గూడలో అపార్టెమెంటుతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో భగీరథ్, బాలిక తిరిగిన వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న తేదీల్లో ఇద్దరి మొబైల్ సిగ్నల్స్ ను ట్రాక్ చేస్తున్నారు. అలాగే అపార్ట్ మెంట్లో వీళ్ళు గడిపిన సమయంలో అక్కడే నివసిస్తున్న ఇతరులతో పాటు వాచ్ మెన్ ను కూడా విచారిస్తున్నారు. వీటన్నింటికన్నా కీలకమైన పాయింట్ ఇంకోటి ఏమిటంటే నిందితుడి ఫ్రెడ్స్ ను కూడా విచారించారు. ఈ పదిమందిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. భగీరథ్-బాలిక మధ్య వ్యవహారాలకు సంబంధించి పోలీసులు ఈ పదిమందిని చాలా లోతుగా విచారించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి నిందితుడి మొబైల్ రెండుమూడు రోజుల్లోనే పోలీసులకు అందనుంది. డిలిట్ చేసిన ఫొటోలు, వీడియోలు, మెసేజెస్ మొత్తాన్ని ల్యాబ్ లో వెనక్కు రప్పిస్తున్నారు. అవన్నీ దొరికితే నిందితుడికి వ్యతిరేకంగా బాలిక, ఆమె తల్లి చేసిన ఆరోపణలకు బలమైన మద్దతు దొరుకుతుంది. అలాగే విచారణలో నిందితుడి ఫ్రెండ్స్ పోలీసులకు ఏమిచెప్పారన్నది సస్పెన్సుగా ఉండిపోయింది. అపార్ట్ మెంట్లో నివస్తున్న వాళ్ళు, వాచ్ మెన్ తదితరుల సాక్ష్యాలు కూడా ఇక్కడ కీలకంగా మారబోతోంది. సో, ఇవన్నీ చూస్తుంటే నిందితుడి మెడకు పోక్సో ఉచ్చు బలంగా బిగుసుకుంటున్నట్లే అర్ధమవుతోంది.

