Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి సంజయ్ పేరుపై నిషేధం

బండి సంజయ్ పేరుపై నిషేధం

పోక్సో కేసును ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కేసుకు సంబంధించిన వార్తల్లో తండ్రిగా కేంద్రమంత్రి బండి సంజయ్ పేరును వాడకుండా సిటీ సివిల్ కోర్టు నిషేధం విధించింది.

భగీరథపై నమోదైన పోక్సో కేసులో తనపేరును వాడటం వల్ల పరువుకు భంగం కలుగుతోందని సంజయ్ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. భగీరథకు సంబంధించిన వార్తల్లో ఎక్కడా తనపేరును ఉపయోగించేందుకు వీల్లేకుండా ఉత్తర్వలు జారీచేయాలని సంజయ్ తన పిటీషన్లో కోర్టును అభ్యర్ధించారు. ఈ కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు సంజయ్ కు అనుకూలంగా ఆదేశాలు జారీచేసింది.

భగీరథ పోక్సో కేసు వార్తల్లో తండ్రి బండి సంజయ్ పేరును ఎక్కడా ప్రస్తావించకూడదు, వాడకూడదని మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళను కోర్టు ఆదేశించింది. ఇప్పటికే మీడియాలో తనపేరుతో వచ్చిన వార్తలను వెంటనే తొలగించాలన్న సంజయ్ రిక్వెస్టును కూడా కోర్టు ఆమోదించింది. ఇకపై భగీరథ పోక్సో కేసులో ఏ రూపంలో కూడా తండ్రిగా బండి సంజయ్ పేరును వాడకూడదని కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ కేసులో పోలీసులు ఎవరిని పట్టుకున్నా సదరు వ్యక్తి పేరుతో పాటు సన్ ఆఫ్ అని తండ్రి పేరు కూడా రాయటం చాలా సహజం. ఈ కేసులో భగీరథ అని రాస్తే చాలామంది జనాలకు అతను ఎవరో కూడా తెలీదు. బండి భగీరథ నేపధ్యం అంతా బండి సంజయే కాబట్టి మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళల్లో బండి భగీరథను బండి సంజయ్ కొడుకని చెబుతున్నారు. బండి సంజయ్ లేకపోతే అసలు బండి భగీరథను పట్టించుకునేవాళ్ళెవరు. బండి సంజయ్ ఎంపీ, కేంద్రమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టే కొడుకు పేరు రాసేటపుడు అందరు సన్ ఆఫ్ బండి సంజయ్ అని రాస్తున్నది. ఇపుడు బండి భగీరథ గురించి రాసేటపుడు బండి సంజయ్ కొడుకు అని రాయకపోతే భగీరథ ఎవరో ఎవరికీ తెలీకుండా పోతుందా ? హేమిటో సంజయ్ ఆలోచన.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA