Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ లో టీఎంసీని చిత్తుగా ఓడించిన బీజేపీ

బెంగాల్ లో టీఎంసీని చిత్తుగా ఓడించిన బీజేపీ

బెంగాల్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 294 సీట్లకు గాను కమలదళం 206 సీట్లు గెలిచింది. అలాగే అస్సాంలోనూ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

126 సీట్లలో ఎన్డీఏ 102 సీట్లు తన ఖాతాలో వేసుకుంది.

తమిళనాడులో ఎవరి అంచనాలకు అందకుండా మొదటి సారి పార్టీ పెట్టి పోటీకి దిగిన కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ పార్టీ 108 స్థానాలలో జయభేరీ మోగించింది. మొత్తం 234 సీట్లలో పోటీకి దిగిన టీవీకే సొంతంగా మెజారిటీ మార్క్ ను మాత్రం అందుకోలేకపోయింది. కేరళలో పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ఈ సారి ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది.ఈ ఎన్నికలలో ముగ్గురు సీఎంలు తమ పదవిని కోల్పోయారు. స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్ పార్టీలు ఓటమి పాలవ్వగా, మమతా బెనర్జీ, స్టాలిన్ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. యాధృచ్చికంగా వీరు ఇద్దరు ఇంతకుముందు తమ కింద పనిచేసిన శిష్యుల చేతిలోనే ఓడిపోయారు.
మోదీ విమర్శలు..
పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ సాధించిన ఘన విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన సోమవారం సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ప్రజా తీర్పును మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ దొంగలించడానికి ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు.తమ పనితీరుకు రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన ఆదేశంగా ఈ విజయాలను మోదీ అభివర్ణించారు. '' మా మంత్రం ఒకటే.. నాగరిక్ దేవో భవ'' అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అన్నారు. అందుకే ప్రజలు తమను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలైనా, పురపాలక సంస్థలైన తమ ప్రభుత్వం భారీ స్థాయిలో ఓట్ల శాతం గెలుచుకుంటుందని, ఇది ప్రజలు తమ ఇచ్చిన ఆశీర్వాదం అని మోదీ అన్నారు.
భారీ స్థాయిలో బలగాలు..
బెంగాల్ ఎన్నికలలో ఈవీఎంలు లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లు ముందు లక్షలమంది భద్రతా దళాలను మోహరించారు. ఈ ఎన్నికలలో టీఎంసీ- బీజేపీ శ్రేణులు ఘర్షణ పడటంతో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఓట్లచోరీ: మమతా బెనర్జీ..
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. 100కు పైగా స్థానాల్లో తీర్పును "దోచుకున్నారని" ఆరోపించారు. భవానిపూర్ నియోజకవర్గంలోని కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వస్తూ, "మేము తిరిగి పుంజుకుంటాము" అని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి అన్నారు.తీవ్ర ఆవేదనతో ఉన్న బెనర్జీ విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ విజయం "అనైతికమైనది" అని అన్నారు. "వారు 100కు పైగా సీట్లను దోచుకున్నారు" అని ఆమె ఆరోపించారు. బెంగాల్ లో బీజేపీ ఓట్లను దొంగలించిందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ ఎక్స్ లో ఆరోపించారు. "ఈసీ మద్దతుతో బీజేపీ ఎన్నికలను దొంగిలించడానికి అస్సాం, బెంగాల్ స్పష్టమైన ఉదాహరణలు. మేము మమతాజీతో ఏకీభవిస్తున్నాము. బెంగాల్‌లో 100కు పైగా సీట్లు దొంగిలించబడ్డాయి." "ఈ ఎత్తుగడను మనం ఇదివరకే చూశాం. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, లోక్‌సభ 2024 మొదలైనవి," అని ఆయన అన్నారు. "చునావ్ చోరీ, సంస్థ చోరీ -- అబ్ ఔర్ చారా హి క్యా హై! (ఎన్నికల దొంగతనం, సంస్థాగత దొంగతనం -- ఇప్పుడు ఇంకేం మార్గం ఉంది!)," అని గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.అస్సాంలో కూడా ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. అక్కడ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ 126 స్థానాలకు గాను 102 స్థానాలను కైవసం చేసుకుని, కాంగ్రెస్‌ను 19 స్థానాలకే పరిమితం చేసి, మరోసారి వరుస విజయాన్ని అందుకుంది. జోర్హాట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తన మొదటి ఎన్నికల ఓటమిని చవిచూశారు.
ద్రవిడ ద్వంద్వాధిపత్యానికి చెక్..
2026 ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ ఒక ముఖ్యాంశం అయితే, మరొకటి సూపర్‌స్టార్ విజయ్. సెప్టెంబర్ 2025లో కరూర్‌లో ఆయన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన మచ్చను, అన్ని అడ్డంకులను ఆయన అధిగమించారు. తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ద్విముఖ చక్రాన్ని ఆయన పార్టీ బద్దలు కొట్టడంతో ఆ సంఘటన గతంలా కనిపిస్తోంది.234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ టీవీకే 108 సీట్లు గెలుచుకోగా, ఆ తర్వాతి స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి 73, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి 52 సీట్లు గెలుచుకున్నాయి. సినీ తారలై రాజకీయ రంగంలో గొప్ప విజయం సాధించిన ఎంజీఆర్, జయలలితల సరసన ఆయన ఇప్పుడు చేరబోతున్నట్లు కనిపిస్తోంది. 'మెర్సల్', 'లియో' వంటి విజయవంతమైన చిత్రాల కథానాయకుడైన విజయ్, వివాహానికి సుమారు రూ. 1.12 లక్షల విలువైన 8 గ్రాముల బంగారం సహా పలు ప్రతిష్టాత్మకమైన వాగ్దానాలతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు.60 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తామని కూడా విజయ్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. విజయ్‌ను అభినందిస్తూ రాహుల్ గాంధీ, "ఈ తీర్పు యువత గళం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.. దీనిని విస్మరించలేము.. విస్మరించబోము" అని అన్నారు.
కేరళ ఓటర్లకు ప్రియాంక ధన్యవాదాలు..
కేరళలో తమ పార్టీ విజయం సాధించడంతో, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, దక్షిణ రాష్ట్ర ప్రజలు అందించిన అఖండ మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. "కేరళలోని నా సోదర సోదరీమణులందరికీ, మీ నమ్మకానికి, మీ అఖండ మద్దతుకు ధన్యవాదాలు. మీలో ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి భవిష్యత్తును నిర్మించడానికి మేము కష్టపడి పనిచేస్తున్నప్పుడు, మీరు మాపై ఉంచిన నమ్మకమే యూడీఎఫ్‌కు మార్గదర్శక శక్తిగా ఉంటుంది" అని ఆమె అన్నారు. పుదుచ్చేరిలో, ఎన్డీఏ తన పట్టును నిలుపుకుంది, కూటమి తరఫున ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి.టీవీకే మూడు సీట్లతో తన ఉనికిని చాటుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA