Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
''బీజేపీ- యూడీఎఫ్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి''

''బీజేపీ- యూడీఎఫ్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి''

యూడీఎఫ్- బీజేపీ మధ్య జరిగిన చీకటి ఒప్పందం వల్లే తాను ఓడిపోయినట్లు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టీ ఆరోపించారు. ఆయన తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నెమోం స్థానం నుంచి ఓటమి పాలయ్యారు.

నియోజకవర్గంలో భారీగా డబ్బు, మద్యం ఖర్చు చేశారని, అది కూడా బీజేపీ గెలుపునకు దోహదపడిందని శివన్‌కుట్టి పేర్కొన్నారు.

ఇక్కడ ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ, సీపీఐ(ఎం), ఎల్‌డీఎఫ్ లెక్కల ప్రకారం నేమోంలో తన ఓటమికి ఆస్కారమే లేదని, కానీ బీజేపీ- యూడీఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగానే ఇది జరిగిందని మంత్రి ఆరోపించారు.వామపక్ష కూటమిని వ్యతిరేకించినందున, ఎల్‌డీఎఫ్ అభ్యర్థులను ఓడించేందుకు రాష్ట్రంలో యూడీఎఫ్, బీజేపీల మధ్య పొత్తు కుదిరిందని ఆయన ఆరోపించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే నేమోంలో కాంగ్రెస్ సుమారు 7,000 ఓట్లను కోల్పోయిందని, యూడీఎఫ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఓట్లు బీజేపీకి వెళ్లాయని శివన్‌కుట్టి ఆరోపించారు.ఎన్నికలలో వామపక్షాల ఓటమికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని, సీపీఐ(ఎం), ఎల్‌డీఎఫ్‌లలో కూలంకషంగా చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి అన్నారు.తరువాత దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తన ఓటమిని ప్రజల తీర్పుగా అంగీకరిస్తున్నానని, తిరువనంతపురం నుంచే ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని ఆయన ఇంకా చెప్పారు.రాష్ట్ర శాసనసభలో ఎల్‌డీఎఫ్ నుంచి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు, గెలిచిన వారందరూ ఆ పదవికి అర్హులేనని, దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని శివన్‌కుట్టి తెలిపారు.140 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం, యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకోగా, సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ 35 స్థానాలకే పరిమితం అయింది. ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం ఎంత బలంగా ఉందంటే, యూడీఎఫ్ సృష్టించిన రాజకీయ సునామీలో కేబినెట్‌లోని 13 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.21 మంది కేబినెట్ సభ్యులలో, యూడీఎఫ్ చేతిలో లెఫ్ట్ ఫ్రంట్ ఘోర పరాజయం పాలైన తర్వాత పినరాయి విజయన్, పీఏ మహమ్మద్ రియాస్, కే రాజన్, జీఆర్ అనిల్, కేఎన్ బాలగోపాల్, పీ ప్రసాద్, సజి చెరియన్ మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA