మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక తెలంగాణ గడ్డ మీద కాలుమోసి పొదుపు సూత్రాలు చెప్పడాన్ని తెలంగాణా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని అనుకుంది.
ఎందుకంటే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని తీసుకున్న కఠిన నిర్ణయం అని తెలంగాణ బిజెపి నాయకులు భావిస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ సభలో మాట్లాడుతున్నపుడే బంగారు కొనవద్దన్నారు, ప్రయాణాలు తగ్గించకోండని చెప్పారు. గడ్డురోజులొస్తున్నాయి, పొదుపు పాటించాలని చెప్పారు. తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లి దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. ఆపైన క్యాబినెట్ కూడా పొదుపు చర్యలకు ఆమోద ముద్ర వేసింది. దీనిని హైదరాబాద్ డిక్లరేషన్ గా తెలంగాణ బిజెపి ప్రచారం చేసుకుని ముందుకు దూసుకు వెళ్లాలనుకుంది. అయితే, బండి ఇంటి నుంచి 'పోస్కో' బాంబ్ పడింది. బిజెపి కల పీడకల అయింది. తెలంగాణలో ప్రతిరాజకీయ చర్చ ఇపుడు బండి చుట్టూరే తిరుగుతూ ఉంది. మరొక అంశం చర్చకు రావడమే లేదు. దీనితో బిజెపికి ఇపుడు మోదీ పొదుపు సూత్రాలను ముందుకు మోసుకెళ్లడం కష్టంగా ఉంది. అలాగని బండి సంజయ్ కొడుకుని సమర్థించడం కష్టంగా ఉంది.
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కున్నారు. నిందితుడు పరారీ లో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించారు. ఇందతా బీజేపీకి చేదు అనుభవం. మీడియాలో బీజేపీ మీద తీవ్ర దుష్ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో పొదుపుసూత్రాలు ప్రచారం చేసుకోవడం గగనమైంది. భారత రాష్ట్ర సమితి(బిఆర్ ఎస్) ఒక ఉద్యమస్థాయికి బండిమీద ప్రచారం మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి, సెక్షన్లు మార్చి ప్రచారం చేస్తున్నది. దీనిని కొట్టడానికి బీజేపీకి శక్తి చాలడం లేదు. దానితో పార్టీ అధ్యక్షుడు అది బండి కుటుంబ వ్యవహారం అంటూ దూరం జరిగారు.
బిజెపి నాయకుల మోదీ పొదుపు మద్దతు ప్రచారం ప్రకటనలకు పరిమితమయితే, ఫీల్డ్ మొత్తం బండి సంజయ్ మీద చర్య తీసుకోవాలి, బండి భగీరథ్ ను అరెస్టు చేయాలని బిఆర్ ఎస్ చేస్తున్న ప్రదర్శనలతో థర్నాలతో నిండిపోయింది. నగరమంతా బండికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నయి. బిఆర్ ఎస్ మహిళు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేస్తున్నారు.
మరొక ప్రధాని పొదుపు మంత్రం తర్వా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు.
బంగారం కొనుగోళ్లను వాయిదా వేయడం వంటి చర్యల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విదేశాంగ విధానంలో కేంద్రం 'వైఫల్యాలను' కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఇది అని ఆయన ఆరోపించారు.
ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మోదీ బంగారం కొనుగోళ్లపై అనధికారిక నిషేధాన్ని విధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పరేడ్ గ్రౌండ్లో మోడీ పొదుపు సూత్రాలను చెప్పారు. అప్పటినుంచి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ మొదలైంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలు ఖండీస్తూ బీజేపీ తెలంగాణా విభాగం స్పీడ్ పెంచింది. ఈ అంశాన్ని తెలంగాణా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే సంక్షోభం
ప్రధాని పర్యటనలో పొదుపు సూత్రాలను కాంగ్రెస్ పార్టీ కావాలని వక్రికరి స్తుస్తుందని బీజేపీ అంటోంది.
"దేశ ప్రయోజనం, ఆర్ధిక క్రమ శిక్షణ, స్వావలంబన, దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడటం సరైంది కాదు" అని తెంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎం వి సుభాష్ అన్నారు.
"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు ప్రధాని సూచనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు "అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరనర్సయ్య గౌడ్ అన్నారు.
"దేశ భక్తి అంటే దేశం కోసం చనిపోవడం మాత్రమే కాదు. దేశం కోసం బతికి సేవ చేయడం కూడా దేశభక్తే . దేశ ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా త్యాగాలు చేయాల్సి వస్తుంది.అదే భావనతో ప్రధాని పొదుపు సూత్రాలు చెప్పారు "అని బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు.
ఇది ఇలా ఉంటే సోలార్ పంపులను వినియోగించండి ప్రధాని ఇచ్చిన పిలుపులో తప్పేముంది అని రిటైర్డ్ ప్రొఫెసర్ పులకంటి మోహన్ రావు అన్నారు. ప్రజా రవాణా వినియోగించండి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించండి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయండి అనడంలో తప్పులేదని ఆయన చెప్పారు.
"ఈ రోజు కూడా లండన్, యూరప్, అమెరికాదేశాల్లో న్యాయమూర్తులు, ఎంపీలు , మంత్రులు, ప్రధానులు ప్రజా రవాణా విస్తృతంగా ఉపయోగిస్తారు. లండన్లో ట్యూబ్స్ పేరుతో అండర్ మెట్రో వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. అది వారికి డబ్బుల్లేక కాదు. ఆర్ధిక క్రమ శిక్షణ, పర్యావరణం కోసం" అని డాక్టర్ కృష్ణా రెడ్డి ఫెడరల్ తెలంగాణ తో అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ మాట్లాడుతూ ప్రధాని సూచనలు బలవంతపు ఆంక్షలు అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుండటాన్ని ఖండించారు.
"ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత వాహనాలను వాడాలని, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కోరారు. ఐటీ రంగంలో అమలవుతున్న కార్‌పూలింగ్ విధానం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంధన పొదుపుకు ఎంతో మేలు చేస్తాయని," అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఖర్చుల్లో మితవ్యయం పాటించాలని, గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ , ఇందిరా గాంధీ కూడా ఆర్థిక ఇబ్బందుల సమయంలో కఠినమైన పొదుపు చర్యలు చేపట్టారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రధాని చేస్తున్న సూచనలను విమర్శించడం సరికాదని రాంచందర్ రావు హితవు పలికారు.

