Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బియ్యం అక్రమరవాణ నివారణకు క్యూ ఆర్ కోడ్

బియ్యం అక్రమరవాణ నివారణకు క్యూ ఆర్ కోడ్

బియ్యం అక్రమరవాణకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూపర్ స్కెచ్ చేసింది. బియ్యం అక్రమరవాణను అడ్డుకునేందుకు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అయితే ఇదే పద్దతిని రాష్ట్రమంతా విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. ఇంతకీ బియ్యం అక్రమరవాణకు చెక్ పెట్టడానికి తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీ ఏమిటంటే క్యూర్ ఆర్ కోడ్ విధానమే.

రేషన్ షాపుల ద్వారా పేదలకు ప్రభుత్వం సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. 1.05 కోట్ల రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం 3.20 కోట్ల మందికి ప్రతినెలా 2.16 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని అందిస్తోంది. అయితే రేషన్ బియ్యాన్ని కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నాయి.

బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ ప్రయత్నిస్తున్నా నూరుశాతం ఫలితాలు రావటంలేదు. అందుకనే బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టేందుకు పౌర సరఫరాల శాఖ నుండి గోదాములకు వెళ్ళే ప్రతి బియ్యం బస్తా మీద క్యూ ఆర్ కోడ్ ముద్రించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. క్యూ ఆర్ కోడ్ లో మండల కేంద్రంలోని స్టాక్ పాయింట్ వివరాలు, అక్కడి నుండి దాన్ని అందుకున్న రేషన్ డీలర్ల సమస్త వివరాలుంటాయి.

క్యూ ఆర్ కోడ్ కు అదనంగా బస్తాపైన రేషన్ షాప్ డీలర్ సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా డీలర్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే వెంటనే సదరు డీలర్ వివరాలు క్యూఆర్ కోడ్ ద్వారా తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని 1200 రేషన్ డీలర్లతో ప్రారంభించబోతున్నారు. నవంబర్ కోటా బియ్యం సరఫరాతో మొదలయ్యే ఈ కొత్త టెక్నాలజీ బ్లాక్ మార్కెట్ ను ఎంతవరకు కంట్రోల్ చేస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA