దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మజ్లీస్ పార్టీ లో ఒవైసి కుటుంబంలో మూడోతరం పరిచయం కానున్నారు. నూరుద్దీన్ ఒవైసి వచ్చే ఎన్నికల్లో చార్మినార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది .
గతంలో ఈ నియోజక వర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకున్నారు.
అక్కడి నుంచి పోటీ చేసిన మాజీ మేయర్ జుల్ఫీకర్ అలీ విజయానికి ఆయన దోహద పడ్డారు, అయితే మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నూరుద్దీన్ ఒవైసి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నూరుద్దీ ప్రస్తుతం సాలార్ ఏ మిల్లత్ విద్యా సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు . నూరుద్దీన్ అనేస్ధిశియా డాక్టర్. తండ్రి అక్బరుద్దీన్ ఒవైసి మజ్లీస్ పార్టీ శాసన సభా పక్షనేత నేతగా ఉన్నారు.

తండ్రి రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్టు గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. అక్బరుద్దీన్ ఒవైసి పై హత్యా యత్నం జరిగిన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొందుతూ సరికొత్త రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో నూరుద్దీన్ చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ చివరి క్షణంలో చార్మినార్ నియోజకవర్గం నుంచి నామినేషన్ ఫైల్ చేశారు.
అతని పై ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదని నామినేషన్ దాఖలు చేసే సమయం లో వెల్లడైంది.వచ్చే ఎన్నికల్లో చార్మినార్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుమారులు ఇంకా రాజకీయాల వైపు ఆసక్తి చూపించక పోవడం తో అక్బరుద్దీన్ ఒవైసి కుమారుడు నూరుద్దీన్ ఒవైసి ఎంట్రీకి మార్గాలు సుగమం అయ్యాయి.
ఇప్పటినుంచే పార్టీ కార్యకర్తలతో నూరుద్దీన్ ఒవైసీ సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. నూరుద్దీన్ ఒవైసీ తాత సుల్తాన్ సల్లాఉద్దీన్ ఒవైసి మజ్లీస్ పార్టీ వ్యవస్థాపకులు. ఆయనకు సాలార్ ఏ మిల్లత్ అనే బిరుదు ఉంది. ఆయన మరణం తర్వాతే అసదుద్దీన్ ఒవైసి మజ్లీస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. నూరుద్దీన్ ఒవైసి ఎంట్రీ తో మజ్లీస్ పార్టీలో కొత్త జోష్ నింపనుంది. పార్టీ బలోపేతానికి నూరుద్దీన్ రాజకీయ ప్రవేశం యువత ప్రాబల్యాన్ని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి.

