Dailyhunt
ఎంకే స్టాలిన్ రాజీనామా

ఎంకే స్టాలిన్ రాజీనామా

మిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే.

సోమవారం వెల్లడయిన ఫలితాల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ అధికారానికి చేరువయ్యింది. 234 అసెంబ్లీ సీట్ల తమిళనాడులో పార్టీ అయినా కూటమి అయినా అధికారం అందుకోవాలంటే 117 సీట్లకు ఒక్క సీటైనా అదనంగా గెలుచుకోవాలి. అంటే మ్యాజిక్ ఫిగర్ 117 సీట్లను దాటాల్సిందే. అయితే ప్రస్తుతం టీవీకే 108 సీట్లతో మిగిలిన కూటములు, పార్టీలకన్నా సీఎం కుర్చీని అందుకునే రేసులో ముందుంది. ఏ కోణంలో చూసినా స్టాలిన్ సీఎంగా కంటిన్యు అయ్యే అవకాశం లేదు. అందుకనే స్టాలిన్ మంగళవారం ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్ కు పంపించారు.

స్టాలిన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్ ను ఉండాల్సిందిగా కోరారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, టీవీకే పార్టీ నాయకత్వంలో ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న విషయంలో ఇప్పటికి క్లారిటి లేదు. ఎందుకంటే 108 సీట్లతో విజయ్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కాలేడు. అందుకు మరో 10 ఎంఎల్ఏల మద్దతు చాలా అవసరం. ఈ నేపధ్యంలోనే 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్, నాలుగు సీట్లు గెలిచిన పీఎంకేతో పాటు నాలుగు సీట్లు గెలిచిన వామపక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. బహుశా ఈరోజు సాయంత్రానికి చర్చలు కొలిక్కి వచ్చి ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటి వచ్చే అవకాశముంది. అప్పటివరకు సస్పెన్స్ తప్పదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA