Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంతప్రయత్నించినా బండి భగీరథ్‌కు రిమాండ్ తప్పలేదా ?

ఎంతప్రయత్నించినా బండి భగీరథ్‌కు రిమాండ్ తప్పలేదా ?

పోక్సో కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ కేంద్రంగా పెద్ద హైడ్రామా నడిచింది. పరారీలో ఉన్న భగీరథ్‌ను అరెస్టుచేసినట్లు సైబరాబాద్ కమిషనర్ రమేష్ ప్రకటించగా లేదు లేదు కొడుకును తానే పోలీసులకు అప్పగించినట్లు తండ్రి బండి సంజయ్ చెబుతున్నారు.

ఇంతకీ భగీరథ్ అరెస్టయ్యాడా లేకపోతే తండ్రే కొడుకును సరెండర్ చేశారా ? అన్నది సస్పెన్సుగా మిగిలిపోయింది. ఏదైతే ఏమి గడచిన వారంరోజులుగా పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు మొత్తానికి పోలీసుల కస్టడీలోకి వెళ్ళాడు. వైద్య పరీక్షలు చేయించి, విచారణ జరిపి చివరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 14 రోజుల రిమాండ్‌కు పంపారు. కొడుకును పోలీసు కస్టడీలో ఉంచకూడదని, రిమాండుకు పంపకూడదని బహుశా ఒక తండ్రిగా బండి సంజయ్ అనుకుని ఉండచ్చు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే పోక్సో కేసులో నిందితుడిగా 14 రోజులు రిమాండులో జైలుకు వెళ్ళటం ఏమిటి ? తండ్రికి ఎంతటి అవమానం. అందుకనే ఏదోపద్దతిలో కొడుక్కి బెయిల్ ఇఫ్పటిచుకోవాలని శతవిధాలుగా ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. భగీరథ్ బెయిల్ కోసం లాయర్లు హైకోర్టులో ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. చివరకు ఏదారిలేక పోలీసులకు లొంగిపోవాల్సొచ్చింది. దాదాపు రెండున్నర గంటల పాటు విచారించి, వివరాలన్నింటినీ రాబట్టి తర్వాత నిందితుడిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. భగీరథ్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ పోలీసులు మెజిస్ట్రేట్‌కు చూపించారు. దాంతో కన్వీన్స్ అయిన మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. వెంటనే పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో బాగా నెగిటివిటీని మూటగట్టుకున్నది ఎవరంటే అది బండి సంజయ్ మాత్రమే. మొదటినుండి కొడుకుది దూకుడు స్వభావమే అని ఇపుడు ప్రపంచానికి మొత్తం తెలిసింది. ఎలాగంటే పోక్సో కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్నాడో కాలేజీ రోజుల్లో అతను ఇతర విద్యార్ధులపై దాడులు చేయటం, ఇతర విద్యార్ధులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియోలన్నీ ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఏ అమ్మాయి అయితే భగీరథ్ మీద ఫిర్యాదు చేసిందో సదరు అమ్మాయితో నిందితుడు సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పరిణామాలతో బండి సంజయే తెలంగాణ సమాజం ముందు గబ్బుపట్టారు. కొడుకును కంట్రోల్ చేయలేకపోవటం ఒకటయితే, కొడుకు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరగటం సంజయ్ కు బాగా నెగిటివ్ అయిపోయింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు అన్న విషయం బాగా ప్రచారమైపోయింది. సంజయే పోలీసులకు దొరక్కుండా కొడుకును దాచిపెట్టాడు అనే ప్రచారం పెరిగిపోయింది. ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటు దాని అనుబంధ సంఘాలు, వామపక్షాలు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు అన్నీవైపుల నుండి భగీరథ్ ను అడ్డంపెట్టుకుని సంజయ్ ను టార్గెట్ చేశాయి. సంజయ్ ను కేంద్రమంత్రివర్గంలో నుండి తప్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనాలు డిమాండ్ చేయటం పెరిగిపోయింది. దాంతో మొదటికే మోసం వచ్చేట్లుందని గ్రహించిన సంజయ్ వేరేదారిలేక కొడుకును పోలీసులకు అప్పగించినట్లుంది.

సంజయ్ ఇపుడు చెబుతున్నట్లు నిజంగానే తనకు చట్టంమీద, న్యాయస్ధానాల మీద నమ్మకం ఉంటే పోక్సో కేసు నమోదవ్వగానే కొడుకును పోలీసులకు అప్పగించటమో లేకపోతే లొంగిపొమ్మని చెప్పేవారే. కానీ అలా చేయకపోవటంతో కొడుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొడుకు ఎక్కడున్నాడో సంజయ్‌కు కచ్చితంగా తెలుసనే ప్రచారం పెరిగిపోవటంతో బాగా ఒత్తిడి ఫీలైనట్లున్నారు. పార్టీలో సపోర్ట్ దొరక్క, బయట విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోతుండటం, చివరకు మంత్రిపదవికి ఎసరు తప్పదనే భయంతోనే చివరకు సంజయ్ కొడుకును పేట్ బషీరా బాద్ పోలీసులకు అప్పగించినట్లు అర్ధమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA