Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెచ్‌డీ క్వాలిటీ సినిమాలతో మళ్ళీ  ప్రత్యక్షమైన 'ఐబొమ్మ'

హెచ్‌డీ క్వాలిటీ సినిమాలతో మళ్ళీ ప్రత్యక్షమైన 'ఐబొమ్మ'

బొమ్మ అంటే తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. అందులోను సినిమా అభిమానులకు ఐబొమ్మ వెబ్ సైట్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంకూడా లేదు.

ఇపుడు ఈ విషయం ఎందుకంటే తాజాగా ఐబొమ్మ వెబ్ సైట్ మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. కొత్తసినిమాలు కూడా హెచ్‌డీ క్వాలిటీతో ఐబొమ్మ తదితర వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవుతుండటంతో పోలీసులు, సినీపెద్దలకు దిక్కుతోచటంలేదు. ఐబొమ్మ వెబ్‌సైట్ పెద్ద తలనొప్పిగా తయారైంది. కొద్దిరోజులు అజ్ఞాతంలో ఉన్న ఐబొమ్మ వెబ్‌సైట్ ఇపుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. కొత్త సినిమాలు కూడా హెచ్‌డీ క్వాలిటీలో ఐబొమ్మ, బప్పం.టీవీలో ప్రత్యక్షమవుతున్నాయి.

విదేశాలలో ఉంటు సంవత్సరాల తరబడి సినీనిర్మాతలను, పోలీసులను ఒక ఆటాడించిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోనే అరెస్టుచేశారు. కేసులు పెట్టి కోర్టు ద్వారా రిమాండుకు పంపేయటంతో పరిశ్రమపెద్దలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త సినిమా అలా విడుదలవ్వటం ఆలస్యం గంటల వ్యవధిలోనే హెచ్‌డీ క్వాలిటీతో పైరసీ సినిమాలు వెబ్‌సైట్లో ప్రత్యక్షమయ్యేవి. పైరసీ వల్ల పరిశ్రమ వేలాది కోట్ల రూపాయాలను నష్టపోయింది. ఐబొమ్మ నిర్వాహకుడి కోసం పోలీసులు ఎన్ని సంవత్సరాలు గాలించినా దొరకలేదు.

ఎక్కడుంటాడో తెలీని, ఏ దేశంనుండి పైరసీని ఆపరేట్ చేస్తున్నాడో తెలియని ఐబొమ్మ రవిని పట్టుకోవటం పోలీసులకు తలకుమించిన పనైపోయింది. ఏమీచేయలేక ఒకదశలో పోలీసులు చేతులెత్తేశారు. దమ్ముంటే పట్టుకోమని పోలీసులను సవాలు చేసిన రవి నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ లోనే దొరికిపోయాడు. దాంతో పరిశ్రమలోని పెద్దలంతా పోలీసులకు అభినందనలు తెలిపారు. ఇకనుండి తమకు పైరసీ సినిమాల బెడద తప్పిందని సంతోషించారు. అయితే వారి సంతోషం ఎన్నోరోజులు నిలవలేదు.

నిందితుడు రవి ఈమధ్యనే బెయిల్ పైన విడుదలయ్యాడు. రవి అలా విడుదలయ్యాడో లేదో వెంటనే కొత్త సినిమాలు హెచ్‌డీ క్వాలిటీతో పైరసీ సినిమాలు మళ్ళీ ఐబొమ్మ, బొప్పటం.టీవీలో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో పోలీసులు, సినీపెద్దలు మళ్ళీ తలలుపట్టుకుంటున్నారు. పైరసీ సినిమాలను ఎలాగ ఆపాలో వీళ్ళకు అర్ధంకావటంలేదు. బెయిల్ పైన విడుదలైన రవియే మళ్ళీ ఐబొమ్మ, బొప్పం.టీవీల ద్వారా పైరసీ సినిమాలను విడుదల చేస్తున్నాడా ? లేకపోతే రవి పేరుతో ఇంకెవరైనా పైరసీ సినిమాలను రిలీజ్ చేస్తున్నారా అన్నదే అర్ధంకావటంలేదు. ఇపుడు ఐబొమ్మ, బొప్పం.టీవీలో ప్రత్యక్షమవుతున్న పైరసీ సినిమాలను ఎలా అడ్డుకోవాలో పోలీసులకు తెలీక నానా అవస్తలు పడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA