Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ ఉన్నా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు: డీఎంకే

కాంగ్రెస్ ఉన్నా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు: డీఎంకే

మిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని సంగతి తెలిసిందే. దాదాపు ఆరు దశాబ్ధాల తరువాత ఓ ద్రవిడేతర పార్టీ సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

టీవీకే కు పూర్తి మెజారిటీ రానిపక్షంలో కాంగ్రెస్ సహ ఇతర పక్షాల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అంచనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో డీఎంకే నాయకుడు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడని టీకేఎస్ ఇలాంగోవన్ అన్నారు. కాంగ్రెస్ కు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని అందువల్ల ఒక్క పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని చెప్పారు.

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. విజయ్ స్థాపించిన పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలు సాధించాయి. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సభ్యుల మద్దతు అవసరం.టీవీకే- అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా తెలియదు. బీజేపీకి ఇప్పటికే అన్నాడీఎంకేకు ఆదేశాలు ఇచ్చి ఉంటుందా అనే ప్రశ్నకు కూడా తమ వద్ద సమాధానం లేదని అన్నారు. ఒకవేళ అన్నాడీఎంకే కు మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది కూలిపోతుందని, తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని డీఎంకే నాయకుడు అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే ఓటమి గురించి కూడా ఆయన మాట్లాడారు.మాకు తెలియకుండా ఏదో తప్పు జరిగిందని చెప్పారు. దానిపై పార్టీ దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. అధికారంలోకి రావడం మాత్రమే తమ ఎజెండా కాదని, తమ పార్టీ అనేక దశాబ్దాలుగా అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు. డీఎంకే అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదని ఇలాంగోవన్ ఆరోపించారు. ''తమిళనాడులో అధికారంలోకి రాలేనందువల్ల బీజేపీ ఇక్కడ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించింది'' అని డీఎంకే నాయకుడు విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA