అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఒక అధికారి దగ్గర కళ్ళుచెదిరే ఆస్తులను పట్టుకున్నారు. హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంతకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం దాడిచేశారు.
ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాల్లో బయటపడిన నగలు, డబ్బు చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. అన్నీకలిపి మార్కెట్ ధరల ప్రకారం ఇప్పటికి బయటపడిన ఆస్తుల విలువ సుమారు రు. 100 కోట్లు ఉంటుందని సమాచారం. తనిఖీల్లో కోటి రూపాయల హార్డ్ క్యాష్, కేజీకి పైగా విలువైన బంగారు నగలు బయటపడ్డాయి.
వీటితో పాటు నిజామాబాద్ లో మూడు ఎకరాల భూమి, లెక్కలేనన్ని ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్ళకు సంబంధించిన దస్తావేజులు బయటపడ్డాయి. ఇవికాకుండా బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్లు గమనించారు. జీఎం భార్యను వెంటపెట్టుకుని ఏసీబీ అధికారులు వివిధ బ్యాంకుల్లోని లాకర్లను ఓపెన్ చేయిస్తున్నారు. ఈ లాకర్లు ఓపెన్ చేయించేందుకు సమయం పడుతుందని సమాచారం.

