Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'లెనిన్' అఖిల్ కి కంబ్యాక్ మూవీ అవుతుందా ?

'లెనిన్' అఖిల్ కి కంబ్యాక్ మూవీ అవుతుందా ?

క్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం 'లెనిన్'. 'ఏజెంట్' సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రం చిత్తూరు, రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ద్రౌపదమ్మ వేడుకల నేపథ్యం, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకూడదనే నిబంధన ఉన్న ఊరిలో జరిగే 'మహాభారతం' లాంటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్, మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్రైలర్‌లో అఖిల్ పలికిన భావోద్వేగ డైలాగులు, ముఖ్యంగా "భారతిని వదిలేయండ్రా.. అది నా ప్రాణం" అనే డైలాగ్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. థమన్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సీనియర్ నటులు శివాజీ, రాంకీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కోసం నాగార్జున కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ కెరీర్‌లో ఒక సాలిడ్ మాస్ హిట్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA