Dailyhunt
మూసీకి గ్రీన్ సిగ్నల్.. కార్తీక్ పిటిషన్ కొట్టివేత

మూసీకి గ్రీన్ సిగ్నల్.. కార్తీక్ పిటిషన్ కొట్టివేత

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేదల ఇళ్లు కూలుస్తునస్నారంటూ బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ) కొట్టివేసింది.

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు ఆపాలని కోరుతూ కార్తీక్ రెడ్డి ఎన్‌జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో కేసు వేశారు. దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలో తాజాగా కార్తీక్ రెడ్డి పిటిషన్‌ను ఎన్‌జీటీ కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకపోయిన కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.

మూసీ పునరుజ్జీవనం పేరుతో చేపడుతున్న పనుల్లో భాగంగా నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించే చర్యలపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. వారిలో కార్తీక్ కూడా ఒకరు. పర్యావరణ అనుమతులు, పునరావాస చర్యలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశం రాజకీయంగా కూడా కీలకంగా మారింది. కాగా తాజాగా ఎన్‌జీటీ నిర్ణయంతో మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ప్రాజెక్ట్‌ను ముందుకు సాగించడానికి ఒక విధంగా ఇది గ్రీన్‌సిగ్నల్ గానే కనిపిస్తోంది.

ఇదే సమయంలో ప్రాజెక్ట్ పురోగతిపై ప్రభుత్వం ముందడుగు వేసింది. మొదటి దశ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ముసాయిదాను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు పంంది. నిధుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇన్ని రోజులు చట్టపరమైన అంశాలు ప్రాజెక్ట్ విషయంలో చిక్కులు తెస్తున్నాయి. తాజాగా ఆ చిక్కులు వీడటంతో మూసీ సుందరీకరణ వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA