Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాన్ వెజ్ గొడవ తో హత్య, ఎందుకలా జరిగింది?

నాన్ వెజ్ గొడవ తో హత్య, ఎందుకలా జరిగింది?

కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు…ఒక వార్త కాదు…, ఇది మన సమాజం మానసికంగా ఎంత అంచుకు చేరుకుందో చూపించే అద్దం.మన సమాజానికి గట్టిగా తాకిన హెచ్చరిక..నాన్ వెజ్ వండలేదా?

అనే సాధారణ ప్రశ్నతో మొదలైన మాటల యుద్ధం… చివరకు ప్రాణం తీసే రక్తపాతం వరకు వెళ్లింది. గోసంగి కాలనీకి చెందిన కోదండ శివ అనే సాధారణ భర్త. తన భార్య లక్ష్మి సాధారణ గృహిణి, ఆ ప్రశ్నే చిన్న గొడవగా మొదలైనది క్షణాల్లో కోపావేశంగా మారింది. ఆ క్షణంలో ఆలోచన ఆగిపోయింది… కోపం మాత్రమే మిగిలింది. పక్కనే ఉన్న కొడవలి ఆయుధమైంది. కొద్ది నిమిషాల్లోనే ఒక కుటుంబం శాశ్వతంగా ఛిద్రమైంది.ఒక క్షణం కోపం… ఒక క్షణం నియంత్రణ కోల్పోవడం… చివరకు భర్త హత్య. ఇది ఒక్క ఇంటి కథ కాదు… ఇది వేల ఇళ్లలో పెరుగుతున్న మౌన సంక్షోభం...ఒక్క క్షణం కోపం… ఒక జీవితాన్ని తీసేయగలదు. ఒక్క క్షణం ఆలోచన… ఒక కుటుంబాన్ని కాపాడగలదు.మనం ఎటు వెళ్తున్నామో చూపించే అద్దం.

క్షణం కోపం ....

ఈ సంఘటనలో భయంకరమైన విషయం ఏమిటంటే -ప్లాన్ చేసిన హత్య కాదు… ఒక క్షణం భావోద్వేగ పేలుడు మాత్రమే. మనిషి మెదడులో కోపం ఎలా పనిచేస్తుందో మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి.మనిషి కోపంలో ఉన్నప్పుడు, మెదడులో ఒక "ఎమర్జెన్సీ మోడ్" ఆన్ అవుతుంది. కోపం వచ్చినప్పుడు Prefrontal cortex shut down (తర్కం చేసే భాగం) →తాత్కాలికంగా పనిచేయడం తగ్గిపోతుంది. అదే సమయంలో Amygdala hijack (భయ-కోప ప్రతిస్పందన కేంద్రం)→ భావోద్వేగం నియంత్రణ అధికంగా స్పందిస్తుంది. ఫలితంగా తక్షణ నిర్ణయాలు, ఆలోచన లేకుండా చర్యలు, ఇక Adrenaline surge → శరీరం యుద్ధానికి సిద్ధమవుతుంది.ఫలితం ఏమిటో తెలుసా ! ఆలోచించకుండా జరిగిన చర్య, ప్రమాదాన్ని అంచనా వేయలేకపోవడం, ఆ తర్వాత పశ్చాత్తాపం… కానీ అప్పటికే ఆలస్యం... తర్వాత పశ్చాత్తాపం, ఈ ఘటనలో కూడా ఇదే జరిగింది. ఆమె ఆలోచించి చేయలేదు… కోపం ఆమెను నడిపించింది.

కుటుంబ వ్యవస్థలో పగుళ్లు..

అసలు సమస్య ఎక్కడ? ఈ సంఘటన మన సమాజంలో అయిదు ప్రధాన బలహీనతలను బయటపెడుతోంది, ఒకటి సహనం తగ్గిపోవడం, చిన్న విషయాలకే తీవ్ర ప్రతిస్పందనలు రావడం పెరిగింది.

రెండోవది సంభాషణ లోపం, భార్యాభర్తల మధ్య మాటలు మాట్లాడే సంస్కృతి తగ్గిపోతోంది.అర్థం చేసుకోవడం కంటే ప్రతిస్పందించడం ఎక్కువైంది. మూడవది మానసిక ఒత్తిడి,రోజువారీ జీవన ఒత్తిళ్లు - ఆర్థిక, కుటుంబ, సామాజిక - ఇవన్నీ కలిపి వ్యక్తిని ఆగ్రహానికి దగ్గర చేస్తాయి.నాలుగోది భావోద్వేగ విద్య లేకపోవడం, మన విద్యా వ్యవస్థలో "anger management" అనే విషయం దాదాపు లేదు. NCRB డేటా ప్రకారం కుటుంబ కలహాలు క్రైమ్‌లలో పెద్ద శాతం,చిన్న గొడవలు పెద్ద నేరాలకు దారి తీసే సంఘటనలు పెరుగుతున్నాయి. అయిదోవది హింసకు సులభ ప్రాప్యత, పక్కనే ఉన్న ఆయుధం… ఒక్క క్షణం కోపం… అంతే ప్రమాదం. ఇది కేవలం "హత్య" కాదు - ఒక మానసిక విఫలం , ఈ ఘటనను కేవలం క్రైమ్‌గా చూడటం సరిపోదు. ఇది ఒక mental health failure.

ఇది ఎందుకు జరుగుతోంది?

తక్షణ స్పందన సంస్కృతి - "Think later, react now,డిజిటల్ యుగంలో సహనం తగ్గింది. సోషల్ మీడియా, ఇన్‌స్టంట్ మెసేజింగ్ మనల్ని వెంటనే స్పందించేలా ట్రైన్ చేశాయి.వేగంగా స్పందించడం → impulsivity పెరుగుతుంది → హింసాత్మక ప్రవర్తనకు దారి. ఆలోచించకుండానే స్పందించడం… ప్రమాదానికి మొదటి మెట్టు. భావోద్వేగ పరిపక్వత లోపం - "వయస్సు పెరిగింది… మనసు కాదు. ఎడ్యుకేషన్ పెరిగింది కానీ emotional intelligence పెరగలేదు. EI తక్కువైతే కోపం నియంత్రణలో ఉండదు, ఇతరుల భావాలు అర్థం కావు, చిన్న విషయాలు పెద్దగా అనిపిస్తాయి.WHO ప్రకారం భావోద్వేగ నియంత్రణ లోపం ఉన్నవారిలో హింస ఎక్కువ. కోపం - సహజ శక్తి, కానీ తప్పు వినియోగం, కోపం సహజమే. కానీ దాన్ని సమస్య పరిష్కారం కాకుండా దాడిగా ఉపయోగించడం ప్రమాదం. ఇల్లు - సేఫ్ ప్లేస్ నుంచి స్ట్రెస్ జోన్

ఇల్లు విశ్రాంతి స్థలం నుంచి ఒత్తిడి కేంద్రంగా మారుతోంది.ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగ అస్థిరత, కుటుంబ బాధ్యతలు

Continuous stress → emotional breakdown. ప్రేమ ఉన్నా… వ్యక్తీకరణలో లోపం ప్రేమ ఉంటుంది, కానీ చూపించే విధానం తప్పుతుంది. అసంతృప్తి కోపంగా బయటపడుతుంది . ఫలితంగా ప్రేమ ఉన్న చోట కూడా హింస పెరుగుతోంది. పాత గాయాలు - కొత్త గొడవలకు ఇంధనం, ఇది ఒక్కరోజు సమస్య కాదు. పాత బాధలు, అపార్థాలు పేరుకుపోయి ఒక రోజు పేలుతాయి.Emotional accumulation effect" → చిన్న trigger, పెద్ద explosion, మానసిక ఆరోగ్యంపై అపోహలు, కౌన్సెలింగ్ అంటే పిచ్చి" అనే భావన ఇంకా ఉంది.సహాయం తీసుకోరు → సమస్యలు లోపలే పెరుగుతాయి → చివరకు ప్రమాదం.

అహం (Ego) - నిశ్శబ్ద శత్రువు, నేను ఎందుకు తగ్గాలి?" అనే ఆలోచన పెరిగింది. వినే గుణం తగ్గుతుంది, క్షమించడం ఉండదు. Ego + anger = destructive, అవకాశం + కోపం = హింస

పక్కనే ప్రమాదకర వస్తువు ఉంటే… కోపం వెంటనే చర్యగా మారుతుంది, దీనిని "situational violence" అంటారు. ఇది ఒక్క క్షణం కోపం కాదు… సంవత్సరాల భావోద్వేగాల పేలుడు.మన సమాజం సమస్యలను ఎదుర్కొనే స్థితిలో లేదు… వాటి నుంచి పేలిపోతున్న స్థితిలో ఉంది.

పరిష్కారం...

1. కోపం వచ్చినప్పుడు 10 సెకన్లు ఆగండి, అది ప్రాణాలను కాపాడగలదు. 2. మాట్లాడండి, అరిచేయొద్దు

సంభాషణే పరిష్కారం. 3. మానసిక సలహా తీసుకోవాలి. కౌన్సెలింగ్ అనేది బలహీనత కాదు.4. కుటుంబాల్లో భావోద్వేగ విద్య అవసరం, పిల్లలకు కోపం ఎలా నియంత్రించాలో నేర్పాలి.మనందరికీ ఒక ప్రశ్న...ఒక ప్లేట్ నాన్ వెజ్ కోసం… ఒక ప్రాణం పోయింది. ఇది మనం చదివి మర్చిపోయే వార్తా? లేక మన జీవితాన్ని మార్చే హెచ్చరికా? కోపం వచ్చినప్పుడు స్పందించకపోవడం… జీవితంలో తీసుకునే గొప్ప నిర్ణయం.

చివరగా ఈ ఘటన మనకు ఒక కఠిన సత్యాన్ని చెబుతోంది, మనిషిని చంపేది ఆయుధం కాదు… నియంత్రణ లేని భావోద్వేగం.కోపాన్ని నియంత్రించలేకపోవడం ఎందుకు పెరుగుతోంది? కుటుంబాల్లో భావోద్వేగ అవగాహన ఎందుకు తగ్గుతోంది? మనం మన పిల్లలకు "anger management" నేర్పిస్తున్నామా? సమాజానికి ఇది స్పష్టమైన సందేశం ఇవ్వాలి. ఈ సంఘటన మనందరికీ మూడు విషయాలు చెబుతోంది, కోపం ఒక ఆయుధం, దాన్ని నియంత్రించకపోతే… అది మనల్ని కూడా నాశనం చేస్తుంది.మాటలే పరిష్కారం, చిన్న గొడవలు మాట్లాడితే ముగుస్తాయి… మౌనం లేదా హింస వాటిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యం పై అవగాహన అవసరం, పిచ్చివాళ్లకే సైకియాట్రిస్ట్ అవసరం" అనే భావన తప్పు. ప్రతి కుటుంబానికి భావోద్వేగ మార్గదర్శకత్వం అవసరం.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA