డా. పి. మోహన్ రావు
స్వతంత్ర భారత సంగ్రామంలో ప్రాణాలొడ్డి అనేక కష్టాలకు ఓర్చి పోరాడి భారతావని దాస్యశృంఖలాలను చేధించిన మహానుభావులు ఎందరో ఉన్నారు.
స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది మహానుభావులు ఉన్న ప్రజలతో మమేకమై ప్రజలేతాను తానే ప్రజలే లోనే విధంగా తమ జీవితాలను నిస్వార్ధంగా ప్రజాసేవకు అంకితం చేసినవారు కొంతమంది మాత్రమే. అటువంటి మహోన్నత నాయకులలో ప్రథమంగా పేర్కొనవలసిన మహానాయకుడు, తెలుగు బిడ్డ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇంతగా అంధ్ర రాష్ట్ర ప్రజలు నచ్చిన మెచ్చిన, ప్రజలను ఆరాధించిన, ప్రజల మనసులను దోచుకున్న ప్రజానాయకుడు ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారి తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మ. ప్రకాశం పంతులు గారు ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి ని మే 20 నాడు జరుపుకుంటున్నాం.
ప్రకాశం పంతులు గారి జీవితం తెరిచిన పుస్తకం. ఆయన తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసారు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మాడో, దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించాడు. ఆయన సుగుణాలే ఆయనకు అలంకారాలు. ఆధునిక కాలంలో చాలామంది రాజకీయ నాయకులు తర తరాలకు సరిపోయే ఆస్తిపాస్తులను సంపాదిస్తారు. పంతులుగారు ఇందుకు పూర్తిగా భిన్నంగా లక్షల ఆస్తులు సంపాదించిన దానిని ప్రజల కోసం ఖర్చు చేశారు.
తనకోసం, ఆయన పైసా కూడా మిగుల్చుకోలేదు. తదనంతరం తన కుటుంబ సంగతి ఏమిటనేది ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఆయన లేమికి ఏనాడు చింతించలేదు. పుట్టింది కడు పేద కుటుంబంలో, పేదవాడిగానే పెరిగారు. లక్షలు సంపాదించారు. న్యాయవాదిగా సంపాదించిన ధనం ప్రజల కోసం ఖర్చు చేశాడు. ఆయన సదా ప్రజల సుఖసంతోషాలను అనుభవించారు. దేశమాత దాస్యశృంఖలాలను చేదించి, ఆమెను సంపూర్ణ స్వాతంత్ర్య వాయువులు, వాయువుల్లో ఊయల భావించాలని తలంపే రాజకీయ సమయంలో నిస్వార్ధంగా ఆయన చేత ఖర్చు పెట్టించింది.
ఆయన జీవితంలో సంఘర్షణలే ఆయన ఆయుధం. పంతులు గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రాజకీయ రంగంలోనూ ఆయనది అటువంటి పరిస్థితే. కపటం లేని ఆయన జీవితం. మోసం లేని ఆయన వాక్కు కొంతమంది. యంత్రాంగం వలన. ఆయన భగవంతుడు ఆరాధించే మహాత్మా గాంధీతో మానసిక వైద్యాన్ని తెచ్చింది. అయినా ఆయన చలించలేదు. తాను నమ్మిన ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించాడు. ప్రజల పక్షాన నిలిచాడు. గాంధీగారి మీద ఆయనకున్న అంచెలంచెల విశ్వాసం సడలలేదు.
మాజీ ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ ప్రకాశం పంతులు గారి విశిష్టతను ప్రశంసిస్తూ ఇలా అన్నారు. "స్వాతంత్ర జ్యోతి సాహసంతో వెలిగించిన దేశభక్త అగ్రశ్రేణిలో చెందినవారు ప్రకాశంగారు. ముందువెనుకలు చూడ ని ధైర్యం, దాతృత్వం వలన ఆయన ఒక పురాణపురుషులయ్యారు. ఆయన ఉత్తేజం వల్లనే వందలాది. అనుయాయులు దేశ స్వాతంత్య్ర్యం కోసం త్యాగాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ జనకుడు. ఆయన భారత జాతీయోద్యమ నాయకుల్లో శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు అని ప్రశంసించారు. ప్రకాశం పంతులు గారి మరణాంతరం సంతాప సందేశంలో పంతులుగారిని ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ రకంగా ప్రశంసించారు.
"నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1920 సంవత్సరం నుండి 1935 వరకు పంతులు గారితో నాకు పరిచయం. సహా చర్యం ఉంది. ఒకప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభవించకపోయినా ఆయన గుణసంపత్తిని నేను. ఎప్పుడు ప్రశంస భావంతోనే చూసేవాడిని. నిత్య జాగరమైన శక్తి నిస్సందేహం తో ఆయనలో ఉండేది. వయోవృద్ధులైన తర్వాత మానవులకు సహజంగానే కొంత శక్తి తగ్గడం చూస్తూంటా యి. అయినప్పటికీ ప్రకాశం గారు ఆచరణలో చూపించే జాగృతి వ్యక్తి. కాగా, దీక్ష కార్యదక్షత మన సంస్కృతి ప్రాంతంలో చెరగని ముద్ర వేశారు. ఆ మహావ్యక్తి. మన మధ్య నుండి వెళ్లిపోయాడు.
ఆయన మహత్వం ఆంధ్రదేశ నిర్మాతగా మాత్రమే కాదు, భారత రాజకీయ రంగం అంతట ఆయన ప్రభావం ఉంది. అందుకు ఈ విధమైన ప్రశంసాపూర్వకమైన నివాళులు అర్పించడం. చాలా ఉచితం. ఆయన బ్రిటిష్ తుపాకులకు గుండె చూపించిన సాహసి అని కొనియాడారు. మరి సంతాప సందేశంలో ఆనాటి లోక్సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగారు. ప్రకాశం పంతులుగారిని ఇలా స్మరించుకున్నారు. "మనం 1928 లో సైమన్ బాయికాట్ చేసిన సమయంలో చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్న వదిలి వెళ్ళిపోయారు.
ప్రకాశంగారు మాత్రం మిలటరీ పోలీసు లను. ప్రజావాణిని అడ్డుకోబోయినప్పుడు. చొక్కా విప్పి తనపై వారు గుండెను పెంచుకోమని గుండె చూపించిన సాహసి ప్రకాశంగారు ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్ర్య సమరంలో త్యాగంచేసిన మహావ్యక్తి, మరణించిన నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగుల్చుకోలేదు.
ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసి ప్రజల గుండెల్లో వారిని. ఉండిపోవాలి ప్రజాసేవ ప్రకాశం పంతులు గారి ఆశించినట్లు ప్రజానాయకులు ఆశయం కావాలి.

