Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజాసింగ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా ?

రాజాసింగ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా ?

గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు బీజేపీ శాసన సభ్యుడిగా గెలిచిన రాజాసింగ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు.

ఇటీవల తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.నియోజకవర్గం లోని తన సన్నిహితులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన రాజాసింగ్ వరుసగా మూడు పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ శాసన సభ్యుడిగా నిలిచారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న రాజాసింగ్ వచ్చే ఎన్నికలల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నియోజకవర్గంలో టైగర్ రాజాసింగ్ గా ఆయనకు పేరుంది. హిందుత్వ నినాదాన్ని ఎత్తుకునే రాజాసింగ్ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు.

మహామ్మద్ ప్రవక్త మీద విద్వేష ప్రసంగాలు చేసి రాజాసింగ్ గతంలో బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు,

బీజేపీ పార్టీ నుంచి తన సస్పెన్షన్‌ను విజయవంతంగా తొలగించుకుని, గోషామహల్ నియోజకవర్గం నుంచి సునాయాసంగా గెలిచిన వివాదాస్పద నాయకుడు రాజా సింగ్ గోషా మహల్ అసెంబ్లీ సీటుపై మళ్ళీ కన్నేశారు. నివేదికల ప్రకారం ఆయన గోషామహల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఇందులో భాగంగా నియోజక వర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు, బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేక పోవడం రాజాసింగ్ కి మింగుడుపడని అంశం. తన ఉనికిని చాటుకోవడానికి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ మంగళ్ ఘాట్ కార్పొరేటర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజాసింగ్ గతంలో మహారాష్ట్ర ఔరంగాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనుకుని భంగ పడ్డారు, తర్వాత హైదరాబాద్ లోక సభ నుంచి పోటీ చేయాలనుకున్నారు, బీజేపీ అధిష్టానం మాధవిలత కు టికెట్ కేటాయించడంతో పార్టీలో మగాళ్లే దొరక లేదా అని రాజా సింగ్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లోకూడా ఆయన పోటీ చేయాలనుకుని భంగపడ్డారు. తీవ్ర మనస్తాపంతో ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాకీ ఆమోద ముద్ర వేయడంతో ఇండిపెండెంట్ శాసన సభ్యుడిగా కొనసాగుతున్నారు. రికార్డుల్లో మాత్రం ఆయన ఇంకా బీజేపీ శాసన సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ శాసన సభ్యుడుగా పోటీ చేయవచ్చని సమాచారం.హిందుత్వవాదం ఎక్కువగా ఉన్న గోషా మహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయుల మెజారిటీ ఆధిపత్యం కొనసాగడమే దీనికి కారణం .

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA