బండి భగీరథ్ పై పోక్సో కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. పోక్సో వివాదంపై శుక్రవారం అర్ధరాత్రి వరకు భగీరథ్ తరపున, బాలిక తరపున లాయర్లు తీవ్రంగా తమ వాదనలు వినిపించారు.
ఈవాదనల్లో ముఖ్యమైన పాయింట్లు రెండున్నాయి. అవేమిటంటే మొదటిది భగీరథ్ పై ఫిర్యాదుచేసిన బాలిక మైనర్ అని తేలిపోయింది. సదరు బాలిక వయసును హైకోర్టు 17 ఏళ్ళ 3 నెలలుగా తేల్చేసింది. కాబట్టి భగీరథ్ పై నమోదైన పోక్సో మరింతగా బిగుసుకుంటోంది.
అలాగే రెండోపాయింట్ ఏమిటంటే అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న నిందితుడి లాయర్ వాదనను జస్టిస్ మాధవీలత తోసిపుచ్చారు. వచ్చేవారానికి కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన జస్టిస్ ముందస్తు బెయిల్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేనని స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ఇప్పటికే గాలిస్తున్న నాలుగు పోలీసు బృందాలు భగీరథ్ ను అరెస్టు చేయవచ్చన్నది సమాచారం.
భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసును ఎలాగైనా కొట్టేయించాలని లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా బాలిక తరపున లాయర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తు నిందితుడికి ఎట్టి పరిస్ధితుల్లోను పోక్సో కేసు నుండి ఎలాంటి రక్షణ కల్పించకూడదని వాదించారు. నిందితుడు రాజకీయ నేపధ్యాన్ని గమనిస్తే సాక్ష్యాలను తారుమారు చేయగలిగిన స్ధితిలో ఉన్నాడన్న బాధితురాలి లాయర్ వాదనలతో జస్టిస్ ఏకీభవించారు. అందుకనే నిందితుడిని అరెస్టుచేయకుండా బెయిల్ ఇవ్వటం సాధ్యంకాదని జస్టిస్ తేల్చిచెప్పేశారు.
ఈనెల 21వ తేదీన ఈ కేసును గురువారానికి కేసును జస్టిస్ వాయిదావేశారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలవరకు ఇరువైపుల లాయర్లు హోరాహోరీగా వాదోపవాదాలు వినిపించారు. అయితే భగీరథ్ లాయర్ వాదనలన్నింటినీ జస్టిస్ తోసిపుచ్చారు. బాధితులకు అండగా నిలబడాలన్న లాయర్ నాగేశ్వరరావు వాదనను కోర్టు సమర్ధించింది.
బాలిక మేజర్ అని, తాను అమ్మాయికి రు. 50 వేలిచ్చినట్లు చెప్పటమే కాకుండా రు. 5 కోట్లు అడిగినట్లు నిందితుడు చెప్పటం, ప్రచారం చేయటం అంతా తప్పని బాలిక తరపు లాయర్ వాదించారు. బాలిక వయసు 17 ఏళ్ళని తేలిపోయిందని అలాగే నిందితుడి దగ్గర నుండి తీసుకున్న 50 వేల రూపాయలను తిరిగి బాలిక ఇచ్చేసిందన్న విషయాన్ని దాచిపెట్టి నిందితుడు దురుద్దేశ్యపూర్వకంగానే బురద చల్లుతున్నట్లు పల్లె నాగేశ్వరరావు వాదనకు నిందితుడు తరపు లాయర్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. మొత్తానికి భగీరథ్ పై పోక్సో కేసు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు, అరెస్టు కాక తప్పదన్నట్లుగానే కనబడుతోంది వ్యవహారం.

