Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ చెప్పింది చాలా ఓవర్‌గా ఉందా

రేవంత్ చెప్పింది చాలా ఓవర్‌గా ఉందా

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంచి మాటకారి అనటంలో ఎవరికీ సందేహంలేదు. మాట్లాడేది కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్పదలచుకున్నది నేరుగా చెప్పేయటమే రేవంత్ బలం.

అలాంటి రేవంత్ తాజాగా మాట్లాడిన మాటలు కాస్త ఓవర్ గా ఉన్నాయనే అనిపిస్తోంది. ఇంతకీ రేవంత్ చెప్పిన మాటలు ఏమిటంటే 2029లో రాహుల్ ను ప్రధానమంత్రిగా చేస్తాడట. తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడట. ఆ తర్వాత రాహుల్ ఇచ్చే కుర్చీలో కూర్చుంటానని చెప్పాడు. దేశంలో తనకు బాగా డిమాండ్ ఉంది అని చెప్పాడు. ఈ మూడు విషయాల్లోనే రేవంత్ చాలా ఓవర్ గా మాట్లాడాడు అని అనిపిస్తోంది.

ఒక్కో పాయింట్ గురించి మాట్లాడుకుంటే 2029లో రాహుల్ ను ప్రధానమంత్రిని రేవంత్ ఎలా చేయగలడు ? రాహుల్ ప్రధానమంత్రి అవటం రేవంత్ చేతిలో లేదు. ఆ విషయం తనకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే దేశమంతా కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తేనే రాహుల్ కి ప్రధానమంత్రి అయ్యే ఛాన్సుంటుంది. ఇపుడు దేశమంతా కాంగ్రెస్ కు ఆధరణ ఉందనే రేవంత్ అనుకుంటున్నాడా ? అలా అనుకుంటే దేశంమొత్తం మీద ఇపుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే. కేరళలో ఉన్నది కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పై మూడురాష్ట్రాల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వస్తుందా అంటే వస్తుందని గట్టిగా ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి ఎలాగ వచ్చేస్తుంది ?

ఇక రెండో పాయింట్ 2034 వరకు తానే సీఎంగా ఉంటానన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయపార్టీ కాదు జాతీయపార్టీ. జాతీయపార్టీల్లో జాతీయ నాయకత్వానిదే అంతిమ నిర్ణయం. రేవంత్ కన్నా గతంలో ఎంతో బలవంతులు అనుకున్న ముఖ్యమంత్రులే మధ్యలోనే కుర్చీలు దిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని లేదా ఉండాలని కోరుకోవటంలో తప్పేమీలేదు. మరో 8 ఏళ్ళు రేవంతే సీఎం అయితే మరి మిగిలిన సీనియర్ల పరిస్ధితి ఏమిటో ?

2034 తర్వాత రాహుల్ ఇచ్చే కుర్చీలో కూర్చుంటాను అనటంలో అర్ధమేమిటి ? రాహుల్ ప్రధానమంత్రి అయితే రేవంత్ కూర్చోవాలి అనుకుంటున్న కుర్చీ ఏముంటుంది ? ఐఏసీసీ అధ్యక్ష పదవి తప్ప అంతటి ప్రాముఖ్యత ఉన్న కుర్చీ పార్టీలో ఇంకేముంటుంది? ఇక చివరగా తనకు దేశంలో డిమాండ్ ఉంది అన్న పాయింట్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా పార్టీ పరంగా డిమాండ్ ఉంటుంది అనటంలో ఆశ్చర్యంలేదు. డిమాండ్ ఉంది కాబట్టే కేరళ ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంచేశాడు. అంతకుముందు జరిగిన మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ ప్రచారంచేసిన విషయం తెలిసిందే. ఏదేమైనా రేవంత్ మాట్లాడిన మాటలు కాస్త ఓవర్‌గానే ఉన్నట్లు అనిపిస్తోంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA