కల్యాణ్ లక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను రద్దుచేయాల్సిందే అని హైకోర్టు లాయర్ పీవీ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం బహుమానాలు ఇవ్వకపోతే ఎవరూ వివాహాలు చేసుకోరా అని సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఎవరూ వివాహాలు చేసుకోలేదా ? అని ఎద్దేవా చేశారు.
ప్రజలకు అత్యవసరమైన వైద్యం విషయంలో ప్రభుత్వం అర్హులైన పేదలకు ఖర్చులు పెట్టడంలో ఎలాంటి తప్పులేదన్న లాయర్. ప్రకృతి విపత్తులపుడు ప్రజలకు ఆదుకోవటానికి ప్రభుత్వం ఎంత ఖర్చుచేసినా తప్పులేదన్న న్యాయవాది. తమకు ఏది ఉచితంగా అందాలనే విషయంలో ప్రజలకే స్పష్టమైన అభిప్రాయం ఉండాలని లాయర్ సూచన
ఉచిత పథకాల అమలుపై చాలాకాలంగా చర్చ జరుగుతున్నా, నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ వల్లే పార్టీలు ఉచితపథకాలను ప్రకటిస్తున్నాయి. ఓట్లకోసమే పార్టీలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయని అభిప్రాయపడిన కృష్ణయ్య. ఉచితాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట పడకపోతే ప్రభుత్వాల ఆర్ధిక పరిస్ధితి అధ్వాన్నమైపోవటం ఖాయమని అంచనా వేసిన లాయర్.

