Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిద్దు తన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నాడా?

సిద్దు తన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నాడా?

ప్రస్తుతం కర్ణాటకలో నాయకత్వ మార్పు వేగంగా జరుగుతున్న తీరుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా నివ్వెరపోయినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పకోవాలని కోరగానే ఇది చాలాకాలం పడుతుందని, పార్టీలో అనేక గ్రూపు తగాదాలకు కారణం అవుతుందని ఏఐసీసీ భావించింది.

కానీ అవేవీ లేకుండా సాఫీగా ఆయన సిద్ధరామయ్య రాజీనామా చేశారు.

అయితే మంత్రివర్గ పున: వ్యవస్థీకరణలో మాత్రం కొన్ని ఆటంకాలు ఎదురువుతున్నాయి. తన విధేయులకు పట్టం కట్టే విషయంలో సిద్ధరామయ్య వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ప్రస్తుతం కాబోయే ముఖ్యమంత్రిగా అందరూ భావిస్తున్న డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. వీరితో విడిగా విడిగా సమావేశం నిర్వహించారు. రాజ్యసభకు, శాసనమండలికి అభ్యర్థులను ఎంపిక చేయడం అనే అంశం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చాయి.

చర్చలకు ఆటంకాలు..
సిద్ధరామయ్య తన డిమాండ్లను హై కమాండ్ ముందు పెట్టారని అయితే హైకమాండ్, డీకే శివకుమార్ అభిప్రాయాలకు ఇవి విరుద్దంగా ఉన్నాయని సమాచారం. ఈ రోజు సాయంత్రం బెంగళూర్ లో కొత్త సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోబోతున్నారు. ఆయన వాస్తవానికి ముఖ్యమంత్రి అవుతారు.కర్ణాటక మంత్రివర్గ ఏర్పాటు కోసం కేరళ తరహ మోడల్ ను అనుసరించాలని రాహుల్ గాంధీ ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు మొత్తం మంత్రివర్గం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసింది. ఇక్కడ కూడా అనే విధానం అనుసరించాలని చూస్తున్నారు. అలాగే పాతవారికి, కొత్తవారికి సమాన అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం మారిన పనిలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది.
నలుగురు డిప్యూటీలు..
ప్రస్తుతం కర్ణాటకలో నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారనే ప్రచారం బాగా జరుగుతోంది. అందులో తన వారే ఉండాలని సిద్ధరామయ్యపట్టుబడుతున్నారు. అయితే ఇద్దరిని నియమించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుందని దళితులు, లింగాయత్ వర్గానికి పదవులు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. సిద్దరామయ్య మాట నెగ్గితే లింగాయత్ నాయకుడైన ఎంబీ పాటిల్ కు, సీనియర్ దళిత నాయకుడైన జి.పరమేశ్వరకు ఆ అవకాశం దక్కవచ్చని కొన్ని వర్గాలు 'ది ఫెడరల్'కు తెలిపాయి. అయితే సిద్ధరామయ్య కింద హోంమంత్రిగా పనిచేసిన జీ. పరమేశ్వర ఆయన కింద డిప్యూటీ పనిచేయడానికి సిద్ధంగా లేరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఆయన దానికే కట్టుబడి ఉంటే.. మరో దళిత నాయకుడికి ఆ పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే హోంమంత్రికి కూడా కొత్త వారికి దక్కే అవకాశం ఉంది.
సిద్దు వర్గానికే ప్రాధాన్యం..
ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న సిద్ధరామయ్య.. తన వర్గానికి మంత్రి పదవులు కట్టబెట్టే విషయంలో మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. హైకమాండ్ కూడా ఇందుకు తల ఊపే పరిస్థితులే కనిపిస్తున్నాయి.కేరళలో రాహుల్ గాంధీ సహయకుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు మద్దతు ఉన్నప్పటికీ వీడీ సతీషన్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే మంత్రివర్గంలో మాత్రంలో ఎనిమిది మంది వేణుగోపాల్ విధేయులే ఉన్నారు. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యకు మద్దతు ఉన్నప్పటికీ డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించబోతున్నారు. కర్ణాటక మంత్రిమండలిలో 34 స్థానాలు ఉన్నాయి. అయితే ఏవైన అసమ్మతి ఎదురైతే వారిని బుజ్జగించడానికి కొన్ని ఖాళీలు ఉంచాలని భావిస్తున్నారు.
అన్ని వర్గాలు..
రాష్ట్రంలో మూడు ప్రధాన వర్గాలైన సిద్ధరామయ్య, శివకుమార్, ఖర్గే విధేయులకు తగిన విధంగా చోటు కల్పించేందుకు విస్తృత కసరత్తు చేస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం మంత్రివర్గం కూర్పు కుదరకపోతే సాయంత్రం 12 నుంచి 15 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో మీడియాతో మాట్లాడవద్దని సిద్ధరామయ్య, శివకుమార్ లను పార్టీ హెచ్చరించింది. కేరళలో ఇటువంటే వ్యూహాన్నే కాంగ్రెస్ అనుసరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA