Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీజేపీ సభ్యులకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సమన్లు

సీజేపీ సభ్యులకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సమన్లు

జంతర్ మంతర్ లో అనుమతి లేకుండా ఆందోళనకు వెళ్లిన సీజేపీ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. సీజేపీ సభ్యుడు అజింక్య షిండేకు కూడా సమన్లు జారీ చేశారు.

ఈ కేసులు అనుమతి లేకుండా ప్రవేశించడం ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం వంటి ఆరోపణలకు సంబంధించినవి.


క్రైమ్ బ్రాంచ్ ముందుకు..
దాస్, రాంకాలను గురువారం మధ్యాహ్నం రాజౌరీ గార్డెన్ లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో హజరుకావాలని కోరారు. వారం రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీలో గడిపిన తరువాత వారు బుధవారం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. అక్టోబర్ 13న ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్) లో జరిగిన అవకతవకల ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ.. సీజేపీ సభ్యులు జంతర్ మంతర్ లోకి ప్రవేశించి జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించడంతో ఈ కేసులు మొదలయ్యాయి.
రెండు ఎఫ్ఐఆర్లు..
పోలీసులు రెండు కేసులనూ తదుపరి దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించారు. మొదటి ఎఫ్ఐఆర్ ను కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయగా, రెండవ దానిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు.నిరసనకారులు బారికేడ్లను దాటి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఆ ప్రాంతంలోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. దానితో స్థానిక సిబ్బంది జోక్యం చేసుకున్నారు. కన్నాట్ ప్లేస్ ఎఫ్ఐఆర్ లో ప్రభుత్వ అధికారి చేసిన ఉత్తర్వును ధిక్కరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో వీరిపై బీఎన్ఎస్ కింద పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ ఎఫ్ఐఆర్, నిరసన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు అడ్డుకోవడం, వారిపై దాడి, పోలీస్ సిబ్బందికి గాయాలు వంటి ఆరోపణలు వారిపై ఉన్నాయి.
కోర్టు విడుదల ఉత్తర్వులూ..
సీజేపీ సభ్యుల పోలీస్ కస్టడీని మూడు రోజుల పాటు పొడిగించాలన్న పోలీసుల అభ్యర్థనను ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ తిరస్కరించడంతో దాస్, రాంకా ఇద్దరు జైలు నుంచి బయటకు వచ్చారు. శాంతిభంగం, గతంలో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. వారు ఒక్కొక్కరు రూ. 50 వేల చొప్పున పూచీ కత్తు సమర్పించిన తరువాత విడుదల చేయాలని మేజిస్ట్రేట్ వారిని ఆదేశించారు. ఇద్దరు శాంతిభద్రతలను కాపాడతామని లిఖితపూర్వకంగా హమీ కూడా ఇచ్చారు.జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశంగా ప్రకటించనంత కాలం అక్కడ నిరసనలకు పిలుపునివ్వకూడదని వారు అంగీకరించినట్లు సమాచారం. ఈ హమీల దృష్ట్యా తదుపరి జ్యూడీషియల్ కస్టడీ అవసరం లేదని భావించిన కోర్టు, వారిని బాండ్లకు కట్టుబడి తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA