Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినీ గ్లామర్‌పై తెలంగాణ బీజేపీ ఫోకస్

సినీ గ్లామర్‌పై తెలంగాణ బీజేపీ ఫోకస్

టీవల తమిళనాడులో సినీ నటుడు విజయ్ అధికారంలో రావడం తో తెలంగాణా బీజేపీ కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వారిని రంగంలో దించాలని యోచిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీలో సహజ నటి , కాంగ్రెస్ మాజీ శాసన సభ్యురాలు జయసుధ, మరో కొందరు నటీమణులు ఆమని,జీవితా రాజశేఖర్ ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన జయసుధ ఆపార్టీలో కొనసాగలేక పోయారు. తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాయంలో ఆమె బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశం అభివృద్ధికి చేస్తున్న కృషికి తాను స్ఫూర్తి చెంది బీజేపీలో చేరినట్టు అప్పట్లో జయసుధ ప్రకటించారు.

జయ సుధ చేరిక తర్వాత చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద తారలు తెలంగాణా బీజేపీలో చెప్పుకో తగ్గ స్థాయిలో చేరలేదు అంతకు ముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీవితా రాజశేఖర్ చేరారు. మరో రెండున్నర ఏళ్లలో తెలంగాణలో ఎన్నికలు జరుగ నున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని బీజేపీ ఎదురు చూస్తుంది. పార్టీ అధికారంలో రావాలంటే సినీ గ్లామర్ దోహద పడుతుందని తెలంగాణా బీజేపీ అంచనా వేస్తుంది.

ఇటీవల తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టి వీ కే అధికారంలో వచ్చింది.విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు ఎంజే రామ్ చంద్రన్, జయలలిత సినీ నటులుగా వెలుగొంది ముఖ్యమంత్రులైన వారే. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సంవత్సరం తిరక్కుండానే ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వారే.

పైగా పవన్ కళ్యాణ్ మోది అభిమాని, మోది కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఇటీవల మోది తెలంగాణా వచ్చినప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు. గత అనుభవాల నేపథ్యంలో తెలంగాణా బీజేపీ సినీ నటులను భారీగా చేర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా చిత్ర పరిశ్రమ, టీవీ ఇండస్ట్రీ కి చెందిన వారిని తెలంగాణా బీజేపీ చీఫ్ రామ్ చందర్ రావు సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి రాంచందర్ రావు సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సినీ సెల్ కన్వీనర్ వైభవ్ సూర్య మాట్లాడుతూ దేశ భక్తి భావజాలం , అభివృద్దని చూసి బీజేపీలో చేరుతున్నారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నటులు మనోహర్, శరత్ , సీనియర్ నటి పద్మ రేఖ, పూజిత బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమైంది. అధికారంలో వస్తామని ప్రచారం చేసుకున్న బీజేపీ కనీసం ప్రధాన ప్రతి పక్ష స్థానానికి చేరుకోలేక పోయింది. మరో రెండున్నర ఏళ్లలో బీజేపీ అధికారంలో రావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి నుంచే సినీ నటులను బీజేపీలో చేర్చుకోవాలని యోచిస్తుంది.

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో బాలుడు మరణానికి అల్లు అర్జున్ కారణమని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పట్లో అల్లు అర్జున్ కి మద్దతుగా బీజేపీ నిలబడింది. రానున్న రోజుల్లో మరికొందరు తారలను బీజేపీ చేర్చుకోనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA