Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫొటో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫొటో

మంగళవారం ఉదయం నుండి ఒక ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఎవరిది అంటే తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దే. విజయ్ ఫొటో వైరల్ అవటం ఏమిటి ?

అనే సందేహం మొదలైందా ? ఆఫొటో ఇప్పటిది కాదు. ఎప్పుడు సుమారు 40 ఏళ్ళ క్రిందటిది. ఫొటోలోని విశేషం ఏమిటంటే ఏదో షాపు ప్రారంభోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి రిబ్బన్ కట్ చేస్తున్నారు. అదే కరుణానిధికి పక్కనే రిబ్బన్ కటింగ్ ను సంతోషంగా చూస్తున్న విజయ్ కనిపిస్తున్నాడు. అప్పట్లో విజయ్ కు మహా ఉంటే ఓ 12 ఏళ్ళుంటాయేమో.

అప్పట్లో కరుణానిధి పక్కనే నిలబడి సంతోషంగా ఉన్నప్పటి ఫొటో రోజుల్లో 2026, ఏప్రిల్, 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి అవుతానని విజయ్ కాని మిగిలిన వాళ్ళు కాని ఎవరూ ఊహించుండరు. పైగా అధికారంలో ఉన్న కరుణానిధి పార్టీ డీఎంకేని మట్టికరిపించాడు. చివరకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా కొళత్తూరు నియోజకవర్గంలో విజయ్ పార్టీ టీవీకే అభ్యర్ధి ఎన్ఎస్ బాబు చేతిలో ఓడిపోయారు. విధి విచిత్రం అంటే ఇదేనేమో. అప్పట్లో కరుణానిధికి పక్కనే నిలబడిన పిల్లోడు పెరిగి పెద్దయి సినిమాల్లో సూపర్ స్టార్ గా మారి తర్వాత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతాడని ఎంతమంది ఊహించుంటారు ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA