Dailyhunt
''స్వయం ప్రకటిత విశ్వ గురువు బండారం బట్టబయలైంది''

''స్వయం ప్రకటిత విశ్వ గురువు బండారం బట్టబయలైంది''

మెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో పాక్ పోషించిన మధ్యవర్తిత్వ భారత్ లో రాజకీయ దుమారం రేపింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానానికి తీవ్ర ఎదురుదెబ్బ అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. "స్వయం ప్రకటిత విశ్వగురువు" బండారం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్, గాజాలపై ఇజ్రాయెల్ దాడులు, పశ్చిమ ఆసియా సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలపై కేంద్రం ఇప్పటికీ "మౌనంగా" ఉందని ఆయన ఆరోపించారు.


ఇజ్రాయెల్ పర్యటనపై ప్రశ్నలు..
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడంపై జైరాం రమేష్ ప్రశ్నలు సంధించారు. దీనివల్ల భారత ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించారు. "పశ్చిమ ఆసియా సంఘర్షణలో ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణను యావత్ ప్రపంచం జాగ్రత్తగా స్వాగతిస్తుంది" అని ఆయన ఎక్స్ లో ప్రస్తావించారు.ఇరాన్‌లో లక్షిత హత్యలతో ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమయ్యాయని, ప్రధాని మోదీ 'ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసిన ఇజ్రాయెల్ పర్యటన' జరిగిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని రమేష్ పేర్కొన్నారు.ఈ పర్యటన 'భారత్ ప్రపంచ ప్రతిష్టను, స్థానాన్ని తగ్గించిందని' ఆయన ఆరోపించారు. "గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమం గురించి, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో దాని దూకుడు విస్తరణవాద విధానాల గురించి శ్రీ నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడలేదు" అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ పాత్రతో దౌత్యపరమైన ఎదురుదెబ్బ..
కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని, అది న్యూఢిల్లీ వైఖరిని దెబ్బతీసిందని ఆరోపించారు. "ముంబై దాడుల తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో తాము ఇలాంటివి సాధించామని పేర్కొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ వైఖరితో వ్యక్తిగత దౌత్యం, సారం, శైలికి రెండింటికి తీవ్రమైన ఎదురుదెబ్బ'' అని ఆయన అన్నారు.పాకిస్తాన్ భాగస్వామ్యం "శ్రీ మోదీ సంప్రదింపుల వ్యూహం, కథన నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది" అని ఆయన జోడించారు. మౌనం, అమెరికా పాత్రపై ప్రశ్నలు రమేష్ వివరించలేని నిర్ణయాలుగా అభివర్ణించిన వాటిని కూడా ఎత్తిచూపుతూ, "మే 10, 2025న ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు అకస్మాత్తుగా, ఆకస్మికంగా నిలిపివేశారో ఆయన గానీ, ఆయన బృందం గానీ ఎన్నడూ వివరించలేదు" అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించి, దాని ఘనతను తామే తీసుకున్నారని ఆయన ఎత్తి చూపారు.
నేపథ్యం..
కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా పాకిస్తాన్ లో జరుగుతున్న చర్చలను వాషింగ్టన్, టెహ్రన్ రెండు గుర్తించాయి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఈ విరామాన్ని స్వాగతించారు. ''అత్యంత వినయంతో తక్షణ కాల్పుల విరమణను ప్రకటిస్తున్నాము'' అని చెబుతూనే చర్చలకు ఆహ్వానించారు.మరోవైపు అమెరికా దాడులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఇరాన్ కూడా దాడులు జరపబోమని వెల్లడించింది. హార్ముజ్ ను తెరుస్తున్నట్లు కూడా పేర్కొంది. ఈ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA