Dailyhunt
తల్లిదండ్రులను చూసుకోవడం కూతుర్ల బాధ్యత కూడా: హైకోర్ట్

తల్లిదండ్రులను చూసుకోవడం కూతుర్ల బాధ్యత కూడా: హైకోర్ట్

వృద్ధులయిన తల్లిదండ్రులను సంరక్షించడంలో కూతురు, కుమారుడు అన్న బేధం ఉండదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులను చూసుకోవడం కూతుర్ల బాధ్యత కూడా అని తేల్చి చెప్పింది.

ముఖ్యంగా ఆస్తిపై హక్కులు కోరేటప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలని పేర్కొంది. సూర్యాపేట జిల్లాకు చెందిన 66 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. పిటిషనర్ తన పిటిషన్‌లో కుమారుడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, కాబట్టి తన ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

ఆమె ప్రస్తుతం తన కుమార్తెతో నివసిస్తున్నట్లు తెలిపింది. 2025 డిసెంబర్‌లో వృద్ధుల సంక్షేమ చట్టం కింద వచ్చిన ఆదేశాలు అమలు కాలేదని ఆమె తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన సూచనలకూ స్పందన రాలేదని పేర్కొన్నారు పిటిషనర్.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి.. వృద్ధుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తిపై హక్కులు కోరుతున్న పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరిస్తున్నారని అన్నారు. కుటుంబ సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని, గెంటివేత చివరి దశగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు కేవలం జెండర్ ఆధారంగా తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను నిర్ణయించలేమని, కుమార్తెలు కూడా సమానంగా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అనంతరం పిటిషన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సూర్యాపేట అధికారుల ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA