బెంగాల్లో భారతీయ జనతాపార్టీ ఘనవిజయం సాధించడంతో తెలంగాణ బీజేపీ కార్యాలయం లో బీజేపీశ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. 2011లో బెంగాల్లో బీజేపీ జీరో ఉండేదని ప్రస్తుతం అధికారాన్ని హస్త గతం చేసుకుందని ఆ పార్టీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు . బెంగాల్లో వచ్చిన విజయం స్ఫూర్తిగా రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారం హస్తగతం చేసుకుంటుందని ఆయన అన్నారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ఓటు చోరీకి పాల్పడిందని ఆయన అన్నారు . హిందువులను అణచి వేయడానికి టీఎంసీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ హస్తగతం చేసుకోనుందని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో రెండుసార్లు ప్రధాని పర్యటించారు. గత 10 ఏళ్ల కెసిఆర్ ప్రభుత్వం, రెండున్నర ఏళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రాంచందర్ రావు పరేడ్ గ్రౌండ్లో అన్నారు. ఈ నెల 10 న ప్రధాని మోడీ రానున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక తెలంగాణ హైదరాబాద్ వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ చీఫ్ పరిశీలించారు.
బీజేపీ బలం పెరుగుతోంది
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ శాసన సభ్యుల సంఖ్య ఎనిమిది. సిర్పూర్ నుంచి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రఘురావు పవార్, ఆర్ముర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి , నిజామాబాద్ అర్బన్ నుంచి ధనపాల్ సూర్య నారాయణ , కామారెడ్డి నుంచి వెంకట రమణ రెడ్డి ,గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలుపొందారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలం పెంచుకుంది.
గాంధీభవన్ లో కాంగ్రెస్ సంబురాలు
కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో గాంధీ భవన్ లో సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేరళ వెళ్లిన సంగతి తెలిసిందే తెలంగాణలో కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కేరళ ప్రచారంలో వివరించారు. ప్రత్యేక తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ బీజేపీ మాత్రం భంగపడ్డది .

