Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ సర్కార్‌పై స్టాలిన్ ఫైర్

విజయ్ సర్కార్‌పై స్టాలిన్ ఫైర్

తమిళనాడులో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని, ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి సి.

జోసెఫ్ విజయ్ హోం శాఖను సమర్థంగా పర్యవేక్షించడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరుస హత్యలు, నేరాలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

దిండిగల్ జిల్లాలో బెయిల్ రిజిస్టర్‌పై సంతకం చేసిన వెంటనే ఓ వ్యక్తిని అతని భార్య ఎదుటే హత్య చేశారని గుర్తు చేశారు. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే శివగంగలో మరో బెయిల్‌పై ఉన్న రౌడీ షీటర్‌ను నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారని పేర్కొన్నారు. బెయిల్‌పై బయట ఉన్న నేరస్థులపై పోలీసుల నిఘా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. అలాగే పెరుందురై సమీపంలో ఓ నర్సును కిడ్నాప్ చేసి, లైంగిక దాడి అనంతరం హత్య చేసిన ఘటనను కూడా స్టాలిన్ ప్రస్తావించారు. ఆమె మృతదేహం ఐదు రోజుల తర్వాత లభించడం రాష్ట్రంలో భద్రతా పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.మాదకద్రవ్యాల వ్యవహారంలోనూ ఆయన అధికార టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. వేదారణ్యంలో గంజాయి అక్రమ రవాణా కేసులో టీవీకే యూనియన్ కార్యదర్శి అరెస్టైన తర్వాత, అదే జిల్లాలో మరో టీవీకే నాయకుడు మెత్ బూపాలన్ కూడా అరెస్టయ్యాడని ఆరోపించారు. కొందరు పార్టీ నాయకులు రాజకీయ అండ ఉందనే భావనతో డ్రగ్స్ నెట్‌వర్క్ నడుపుతున్నారని ఆయన అన్నారు.డ్రగ్స్ నియంత్రణపై ఇటీవల విజయ్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, యువతకు "డ్రగ్స్ మానేసి క్రీడలను ఎంచుకోండి" అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు తన శాఖపై పూర్తి దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని స్టాలిన్ చురకలంటిచారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు డ్రగ్స్‌పై సమర్థవంతమైన చర్యలకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA