Dailyhunt
వృద్ధాప్యాన్ని అనందమయం చేసుకోవడమెలా?

వృద్ధాప్యాన్ని అనందమయం చేసుకోవడమెలా?

వృద్ధాప్యం అంటే ఒంటి నిండా ఆరోగ్య సమస్యలు, గంటగంటకు వేసుకునే మందు గోలీలు, ఆసుపత్రికి ఇంటికి మధ్య జరిగిపోయే జీవితమనే చాలా మంది అనుకుంటారు. వృద్ధాప్యంలో బాధ, సమస్యలు తప్ప మరేమీ ఉండవని, కాటికి కాళ్లు చాపుకుని కూర్చోడమే అని చాలా మంది చెప్తారు.

కానీ జపాన్‌కు చెందిన 61 సంవత్సరాల సైక్రియార్టిస్ట్ హిడేకి వాద(Hideki Wada) మాత్రం వృద్ధాప్యానికి సరికొత్త నిర్వచనం చెప్తున్నారు. వృద్ధాప్యం అంటే సమస్య కాదు.. సంతోషం అంటున్నారు. వృద్దాప్యాన్ని మందులతో చేసే స్నేహంగా కాకుండా మనతో, మనవాళ్లతో గడిపే మధుర క్షణాలుగా చూడాలంటున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే వృద్ధాప్యం 'గోల్డెన్ ఏజ్'. ఈ విషయాన్ని ఆయన ఎక్కడో కూర్చుని చెప్పలేదు.. ప్రపంచానికి వినిపించేలా రాసి చెప్పారు. '80 ఇయర్ ఓల్డ్ వాల్' (80-year-old Wall) అన్న పేరుతో ఆయన రాసిన పుస్తకం వృద్ధాప్యపు అందాన్ని, ఆనందాన్ని, దాని గడపంలో ఉండే మాధుర్యాన్ని చెప్పారు. అంతేకాకుండా అసలు వృద్ధాప్యం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అన్నది కూడా వివరించారు.

హిడేకి రాసిన పుస్తకం.. వయసు పైబడం అంటే భయపడాలని చెప్పదు. తమ 80ఏళ్ల వయసులో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలి అని చెప్పే ఒక గైడ్, ఒక గోల్డెన్ ప్రిస్క్రిప్షన్. సైకియాట్రిస్ట్‌గా తనకున్న 35 ఏళ్ల అనుభవాన్ని రంగరించి.. వృద్ధాప్యాన్ని ఎలా గడపాలో చెప్పిన గ్రంథం. ఆయన 80-100 మధ్య వయసును 'లక్కీ ఏజ్' అని చెప్పడమే కాదు.. దానిని వివరించిన తీరు కూడా ఎందరినో ఆకట్టుకుంది. వృద్ధాప్యంలో ఆనందానికి, ఆమోదానికి ప్రాధాన్యతనిస్తూ అతిగా మందులు వాడటాన్ని తగ్గించి తన అటానమీని అర్థం చేసుకోవాలని వివరించారు.

జపాన్‌లో సగటు జీవిత ప్రమాణం పురుషుల్లో 81.64 సంవత్సరాలు, మహిళల్లో 87.74 సంవత్సరాలు ఉంది. అందులో ఆరోగ్యకరమైన జీవన ప్రమాణం పురుషుల్లో 72.68 సంవత్సరాలు, మహిళల్లో 75.38 సంవత్సరాలుగా ఉంది. అంటే పురుషుడు 9 సంవత్సరాలు, మహిళలు 12 సంవత్సాల పాటు ఒకరిపై ఆధారపడి, ఒకరి పర్యవేక్షణలో ఉండాలి. ఈ అవసరాన్ని తగ్గించడమే హిడాకి రాసిన పుస్తకం మెయిన్ మిషన్.

మెడిసిన్స్ అవసరం లేదు..

వాద చెప్పే చాలా విషయాలు ప్రధాన మెడికల్ కట్టుబాట్లకు విరుద్ధంగా ఉంటాయి. మందులు మాకులు వాడటానికి బదులు సహజసిద్ధంగా జీవించాలని చెప్తారు. వాటిలో ఆయన వృద్ధులు ప్రధానంగా ఎదుర్కొనే కొన్ని సమస్యలను వివరించారు.

నిద్రలేమి: వృద్ధుల్లో నిద్రలేమి సమస్య ఉందంటే వైద్యులు చాలా మంది టాబ్లెట్లు ఇస్తారు. నిద్ర పట్టకపోతే ఆ టాబ్లెట్ వేసుకోమంటారు. కానీ వదా మాత్రం.. నిద్రలేమి ప్రాణాంతకం కాదు కాబట్టి టాబ్లెట్లు వద్దని చెప్పారు. అంతేకాకుండా కావాల్సినంత సేపు నిద్రపోతూ తమ వయసు తమకు ఇచ్చిన ఈ నిద్ర స్వేచ్ఛను మరింత ఆనందంగా ఆస్వాదించాలంటారు.

కొలెస్ట్రాల్: వాద దృష్టిలో అధిక కొలెస్ట్రాల్ విలన్ కాదు. ఈ కొలెస్ట్రాల్ మన రోగనిరోధక శక్తికి కీలకమైనవి, దీనిని మరీ తగ్గించేయడం శారీరిక, మానసిక సమస్యలను కారణమవుతుంది.

రక్తపోటు: బ్లడ్ ప్రెజర్ ఈ విషయంలో అయితే వదా కాస్తంత అగ్రెసివ్‌గా ఉన్నారు. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం చెప్పినట్లు 150mmHg బ్లడ్ ప్రెజర్ వల్ల నరాలు చిట్లిపోవని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీపీ 200 దాటినా అది అంత ప్రమాదకారి కాదని అంటారు వాద.

వాద చెప్పేది ఏంటంటే.. వృద్ధాప్యంలో సహజంగా వచ్చే చిన్నచిన్న సమస్యలకు కూడా మెడిసిన్ వాడటం.. ఆనందాన్ని లాగేసుకుంటుంది. మరి సహజంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, వృద్ధాప్యాన్ని ఆనందించాలన్నా కొన్ని రూల్స్ ఉన్నాయంటూ.. వాద 44 విషయాలు చెప్పారు.

వాడా చెప్పిన "44 సూత్రాలు" ఇందులో ముఖ్యంగా నిలిచాయి. రోజూ నడవాలని, శరీరం గట్టిపడకుండా కదలాలని సూచించారు. ఎక్కువసార్లు నమిలి తినడం వల్ల శరీరం చురుకుగా ఉంటుందని చెప్పారు. ఒంటరిగా ఉండటం అంటే ఒంటరితనం కాదని, అది ప్రశాంత సమయం అని వివరించారు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మెదడును ఉపయోగించకపోతేనే జ్ఞాపకశక్తి తగ్గుతుందని చెప్పారు. కొత్తగా నేర్చుకోవడం ఆపేస్తేనే వృద్ధాప్యం వేగంగా వస్తుందని హెచ్చరించారు. ఆహారం విషయంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. మనకు నచ్చినది తినాలని, కొద్దిగా లావుగా ఉండటం తప్పు కాదని పేర్కొన్నారు. నిద్ర రాకపోతే బలవంతంగా పడుకోకూడదని సూచించారు.

వృద్ధాప్యాన్ని కూడా ఆయన కొత్తగా నిర్వచించారు. జీవిత చివర్లో వచ్చే మార్పులను సహజంగా స్వీకరించాలని చెప్పారు. చిన్నపిల్లల మాదిరిగా సంతోషంగా ఉండటం పెద్దల ప్రత్యేకత అని వివరించారు. కోరికలు ఉండటం ఆయుష్షును పెంచుతుందని చెప్పారు.

సామాజికంగా కూడా కొన్ని సూచనలు చేశారు. నచ్చని వ్యక్తులతో కలవాల్సిన అవసరం లేదని, మనసులో ఉన్నది చెప్పుకోవాలని చెప్పారు. జీవితం సింపుల్‌గా గడపాలని, నవ్వుతూ ఉండాలని సూచించారు. జపాన్‌లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ ఆలోచనలు సమయోచితంగా మారాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ పుస్తకం కొత్త దారి చూపించింది.

అయితే కొన్ని వైద్యులు ఈ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించలేదు. రక్తపోటు, ఆరోగ్య పరీక్షలు ఇంకా అవసరమేనని చెప్పారు. దీనికి స్పందించిన వాడా, పరీక్షలు చేయొచ్చు కానీ వాటి ఆధారంగా జీవితం నడపకూడదని భావించినట్లు వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA