Saturday, 23 Jan, 5.25 pm The Leo News

Posts
చిరు, నాగ్ లను కలిసిన సోహెల్ – ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

తనని ఎంతగానో ప్రొత్సహించిన చిరంజీవికి థ్యాంక్స్ చెప్పేందుకు సోహెల్ కలిశారు. చిరంజీవినే కాకుండా చిరంజీవి భార్య సురేఖ, అమ్మ అంజనీదేవిని కూడా సోహెల్ కలిసారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు

బిగ్ బాస్ 4 గుర్తుకురాగానే.. ఠక్కున గుర్తుకువచ్చేది సోహోల్. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్ కంటే.. ఎక్కువుగా పాపులర్ అయ్యింది సోహెల్. కథ వేరే ఉంటుంది అని సోహెల్ చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడం.. సోహెల్ సినిమా చేస్తానంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తన చేతుల మీదుగా జరిపిస్తానని మాట ఇవ్వడంతో పాటు.. ఆ సినిమాలో చిన్న పాత్ర సైతం చేస్తానని మెగాస్టార్ అనడం తెలిసిందే.

తనని ఎంతగానో ప్రొత్సహించిన చిరంజీవికి థ్యాంక్స్ చెప్పేందుకు సోహెల్ కలిశారు. చిరంజీవినే కాకుండా చిరంజీవి భార్య సురేఖ, అమ్మ అంజనీదేవిని కూడా సోహెల్ కలిసారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే బిగ్ బాస్ 4 హోస్ట్ కింగ్ నాగార్జునను కూడా సోహెల్ కలిశారు. నాగార్జునను కలిసిన సోహెల్.. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేశాడు. నాగార్జునతో ఉన్న సమయం చెప్పిన మాటలను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్.. మీ సూచనలు ఎప్పుడూ ఫాలో అవుతాను అన్నాడు. చిరంజీవి, నాగార్జునలను కలిసిన సోహెల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. సోహెల్ హీరోగా నటిస్తున్న సినిమా ఇటీవల స్టార్ట్ అయ్యింది. మరి.. ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తారా..? లేక సోహెల్ నటించనున్న మరో మూవీలో చిరు నటించనున్నారా.? అనేది తెలియాల్సివుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: The Leo News
Top