Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

The Leo News 5 years ago

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పంతాన్ని నెరవేర్చుకునే దిశగా మొదటి అడుగు వేశారు. అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ పై ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించడం తన బాధ్యతగా పేర్కోన్నారు నిమ్మగడ్డ. పంచాయతీరాజ్ శాఖ మెరుగైన పనితీరు కనబర్చాల్సిన అవసరం ఉందని..

కానీ వారి నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఎన్నికల సమస్య అపరిష్కృతంగా మారిందని చెప్పారు. వారిపై సరైన సమయంలో చర్యలు చేపడతామని తెలియజేశారు.

సుప్రీంలో కేసు ఉంది.. ఒకవేళ ఎన్నికలు ఆపండని కోర్టు ఆదేశిస్తే.. దాన్న పాటించడానికి ఎన్నికల కమిషన్ సిద్దంగా ఉందని చెప్పుకొచ్చారు. దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే ఏపీ మాత్రం ఎన్నికలు ఆపండంటూ ప్రభుత్వం కోర్టుకెక్కడం సహేతుకం కాదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని పేర్కోన్నారు. 2019 జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్న కారణంగా 3 లక్షల మందికి ఓటు హక్కును కోల్పోయారని ప్రకటించారు. ఏపీలో నాలుగు దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుందని చెప్పారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో తొలివిడతలో జరగవని పేర్కొన్నారు.

  • తొలి విడత ఎన్నికలకు 25 నుంచి నోటిఫికేషన్ స్వీకరిస్తారు.
  • ఈ నెల 27 నామినేషన్లకు తుది గడువు, 28న నామినేషన్లు పరిశీలిస్తారు.
  • 29వ తేదీన నామినేషన్ల అభ్యంతరాలను పరిశీలించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.
  • తదుపరి రోజు, జనవరి 30 న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 31 నామినేషన్లకు తుది గడువుగా ప్రకటించారు.
  • ఫిబ్రవరి 5న తొలి విడత పోలింగ్ జరుగుతుంది.
  • పోలింగ్ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 3:30 వరకు జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి కౌంటింగ్ మొదలవుతుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Leo News