Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

TheTeluguNews 3 days ago

Indiramma Houses : తెలంగాణలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది.

సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. అదే సమయంలో సొంత ఇంటి స్థలం లేని పేద కుటుంబాలకు కూడా ఇందిరమ్మ హౌసింగ్ అపార్ట్‌మెంట్స్ నిర్మించి ఫ్లాట్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తాజాగా ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో పాల్గొనేందుకు అర్హత సాధించిన దరఖాస్తుదారుల వివరాలను హౌసింగ్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి 60,720 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన అనంతరం అర్హత లేని వారిని గుర్తించి వారికి నోటీసులు కూడా పంపించారు.

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Indiramma Houses ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి ఎవరు అర్హులు?

ప్రాథమిక పరిశీలనలో అనర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అర్హత ఉన్నవారి పేర్లను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. నగరంలో స్థిర నివాసం లేని వారు, ఇప్పటికే సొంత ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్నవారు, వ్యక్తిగత అవసరాల కోసం ఫోర్ వీలర్ ఉపయోగిస్తున్నవారిని అనర్హులుగా పరిగణించినట్లు సమాచారం. అయితే క్యాబ్ సర్వీసుల కోసం వాహనాన్ని వినియోగించే వారికి మాత్రం అర్హత ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అర్హత సాధించిన దరఖాస్తుదారులలో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 27 నుంచి 30వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ నిర్వహించి ఇళ్లను కేటాయించనున్నారు. లాటరీలో పేరు వచ్చిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అందించనున్నారు.

Indiramma Houses మీ పేరు లాటరీ జాబితాలో ఉందో ఇలా చెక్ చేసుకోండి

ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉపయోగించి సంబంధిత వెబ్‌సైట్లలో వివరాలను చెక్ చేసుకునే అవకాశం ఉంది.

ts.meeseva.telangana.gov.in
tghb.cgg.gov.in
tghb.telangana.gov.in

దరఖాస్తుదారులు తమ వివరాలను నమోదు చేసి అర్హత స్థితిని పరిశీలించుకోవచ్చు. లాటరీకి అర్హత సాధించిన వారి పేర్లు, తదుపరి కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు వెల్లడించనున్నారు.

ఈ నెలాఖరులోగా ఇళ్ల కేటాయింపు పూర్తి

హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. అనర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని, వాటిని పరిశీలించిన తర్వాత అర్హత ఉన్నవారిని జాబితాలో చేర్చుతామని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇల్లు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా లాటరీ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ పేరు జాబితాలో ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews