Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indiramma Houses : తెలంగాణా లో వాళ్ళందరికీ బిగ్ శుభవార్త..!

Indiramma Houses : తెలంగాణా లో వాళ్ళందరికీ బిగ్ శుభవార్త..!

TheTeluguNews 14 hrs ago

Indiramma Houses : తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఎదురుచూస్తున్న నిరుపేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

పేదల సొంతింటి కలను నిజం చేసే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’లో లబ్ధిదారులకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెడుతూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇల్లు లేని అర్హులైన పేదలకు సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పథకంలో ఫైనల్ బిల్లుల చెల్లింపులపై మంత్రి శుభవార్త అందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇంకా రాకపోయినా సరే, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా లబ్ధిదారుల చివరి బిల్లులను వెంటనే చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Indiramma Houses : తెలంగాణా లో వాళ్ళందరికీ బిగ్ శుభవార్త..!

Indiramma Houses : కేంద్ర నిధులు రాకున్నా.. లబ్ధిదారుల ఖాతాల్లోకి ఫైనల్ బిల్లులు

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి మూడు విడతల బిల్లులు విజయవంతంగా అందాయి. కానీ, చివరి బిల్లు చెల్లింపులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉండటంతో కాస్త జాప్యం జరిగింది. ఈ ఆలస్యంపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. కేంద్రం వాటా కోసం దాదాపు ఏడాది పాటు నిరీక్షించామని తెలిపారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి, సంబంధిత కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఢిల్లీ నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విదిలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకూడదనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ బిల్లులను విడుదల చేస్తోందని ప్రకటించారు.

ఇందులో భాగంగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు చివరి బిల్లుల కింద ఏకంగా రూ.185 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. మిగిలిన వారికి కూడా విడతల వారీగా చెల్లింపులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయని మంత్రి హామీ ఇచ్చారు.

Indiramma Houses సెప్టెంబర్ 15 నాటికి రెండో విడత.. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్కీ డ్రా

ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా ఎదురుచూస్తున్న వారికి కూడా ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వచ్చే సెప్టెంబరు 15 నాటికి పూర్తిగా ముగించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పేదల కోసం ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణాలు కూడా అత్యంత శరవేగంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లోని మొత్తం 14 నియోజకవర్గాల నుంచి ఈ టవర్స్ కోసం సుమారు 60 వేలకు పైగా దరఖాస్తులు రాగా, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అందులో 40 వేల మందిని అర్హులుగా అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున ప్రభుత్వం కేటాయించనుంది. ఈ ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ఆగస్టు 28 నుంచి 31 వరకు అర్హులైన వారి మధ్య లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాలతో తెలంగాణలో సొంతింటి కోసం నిరీక్షిస్తున్న వేలాది కుటుంబాలకు ఊరట లభించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews