Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam 2 Today Episode August 27th : కార్తీక దీపం 2: పెళ్లి మండపంలో జ్యోత్స్న బిగ్ ట్విస్ట్.. దీప అసలు తల్లిదండ్రులు వీరే..!

Karthika Deepam 2 Today Episode August 27th : కార్తీక దీపం 2: పెళ్లి మండపంలో జ్యోత్స్న బిగ్ ట్విస్ట్.. దీప అసలు తల్లిదండ్రులు వీరే..!

TheTeluguNews 2 weeks ago

Karthika Deepam 2 Today Episode August 27th : కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇన్నాళ్లుగా దాచిపెట్టిన ఓ పెద్ద నిజాన్ని జ్యోత్స్న అందరి ముందూ బయటపెట్టడంతో పెళ్లి వేడుక ఒక్కసారిగా భావోద్వేగంగా మారిపోయింది.

దీప అసలు సుమిత్ర కన్నకూతురేనని జ్యోత్స్న వెల్లడించడంతో శివన్నారాయణతో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ముందుగా గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూస్తే.. జ్యోత్స్న పెళ్లికి దక్షిణామూర్తి కూడా రావడానికి సిద్ధమవుతాడు. అయితే మాలిని ఆయనను అడ్డుకుంటుంది. మీరు పెళ్లికి వస్తే అక్కడ ఏదైనా అవమానం జరిగితే తాను తట్టుకోలేనని, అందుకే ఇక్కడే ఉండాలని దక్షిణామూర్తిని ఒప్పిస్తుంది. అనంతరం మాలిని పెళ్లికి బయలుదేరుతుంది.మరోవైపు గిఫ్ట్ ఇవ్వడానికి జ్యోత్స్న గదిలోకి సూరజ్ వస్తాడు. అతడిని చూసి జ్యోత్స్న సిగ్గుపడుతుంది. ఎవ్వరూ లేని సమయంలో తన గదిలోకి ఇలా రావడం సరికాదని చెబుతుంది. తన కోసం సూరజ్ ఇప్పటికే ఎన్నో గిఫ్టులు ఇచ్చాడని, తాను మాత్రం అతడికి ఏమీ ఇవ్వలేకపోయానని అంటుంది. అందుకే ఈ గిఫ్ట్ తీసుకొచ్చానని సూరజ్ చెబుతాడు. అయితే ఈ గిఫ్ట్‌ను వారి పెళ్లి జరిగిన తర్వాతే ఓపెన్ చేయాలని సూచిస్తాడు. వెంటనే జ్యోత్స్న గులాబీ పువ్వు తీసుకుని సూరజ్‌కు ప్రపోజ్ చేస్తుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతుండగా శివన్నారాయణ బంధువులు అక్కడికి చేరుకుంటారు. ఇంతలో మాలిని రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. మాలిని ముందు వరుసలోనే కూర్చోవాలని శివన్నారాయణ చెబుతాడు. పెళ్లి పీటలపైకి వెళ్లే ముందు జ్యోత్స్న దాస్ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. తన బిడ్డను పెళ్లికూతురిగా చూడటంతో దాస్ ఎంతో సంతోషిస్తాడు. అదే సమయంలో పెళ్లి జరిగిన వెంటనే తాను దాస్ కూతురిననే నిజాన్ని అందరికీ చెబుతానని జ్యోత్స్న ప్రకటించడంతో దాస్, పారు షాక్ అవుతారు. ఇదే గత ఎపిసోడ్‌లో కీలకంగా నిలిచిన అంశం.

Karthika Deepam 2 Today Episode August 27th : కార్తీక దీపం 2: పెళ్లి మండపంలో జ్యోత్స్న బిగ్ ట్విస్ట్.. దీప అసలు తల్లిదండ్రులు వీరే..!

Karthika Deepam 2 Today Episode August 27th జ్యోత్స్న సంచలన నిర్ణయం.. దీపకు ఇచ్చిన మాట

ఇక ఆగస్టు 27న ప్రసారమైన 762వ ఎపిసోడ్‌లో జ్యోత్స్న తన మనసులోని మాటను మరోసారి స్పష్టంగా చెబుతుంది. తాను చేసిన పాపాల్లో కొన్నింటినైనా కడుక్కోవాలని, దశరథ కూతురిగా పెళ్లి చేసుకున్నప్పటికీ.. దాస్ కూతురిగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతుంది. తన మెడలో తాళి పడిన వెంటనే అసలు నిజాన్ని అందరికీ చెప్పేస్తానని జ్యోత్స్న అంటుంది. దాస్ కూడా "నీకు నచ్చినది చేయి" అని ఆమె నిర్ణయానికి అడ్డుచెప్పడు. ఇంతలో దీప అక్కడికి వచ్చి ముహూర్తం సమయం అవుతోందని చెప్పి జ్యోత్స్నను పెళ్లి పీటలపైకి తీసుకెళ్తుంది. బాబాయ్‌తో ఏం మాట్లాడుతున్నావని దీప అడగగా.. తాను దాస్ కూతురిననే నిజాన్ని అందరి ముందూ చెప్పబోతున్నానని జ్యోత్స్న వెల్లడిస్తుంది. తాళి తన మెడలో పడిన వెంటనే తాను చేసే మొదటి పని ఇదేనని చెబుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని జ్యోత్స్న బాధపడుతుంది. తాను ఇన్నాళ్లూ అనుభవిస్తున్న సౌకర్యాలు నిజానికి దీపకు దక్కాల్సినవేనని చెబుతుంది. నీకు అమ్మ ఉన్నప్పటికీ అనాథలా జీవించావని, ఎన్నో కష్టాలు అనుభవించావని, తన కోసం కూడా చాలా చేశావని దీపతో అంటుంది. అందుకే నీ రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నానని చెబుతుంది. ఈ మార్పుతో తాను నిజంగా మనిషిగా మారానని, ఇకపై మనిషిగానే జీవిస్తానని జ్యోత్స్న అంటుంది. తన సూరజ్ తనను అర్థం చేసుకుంటాడని కూడా జ్యోత్స్న చెబుతుంది. ఇంతకంటే మంచి అవకాశం, మంచి సమయం మళ్లీ రాదని.. తనలో వచ్చిన ఈ మార్పు దీపకు నచ్చడం లేదా అని ప్రశ్నిస్తుంది. దాంతో దీప జ్యోత్స్నను ముద్దు పెట్టుకుంటుంది.

నిజం బయటకు చెప్పిన తర్వాత ఏం జరిగినా సరే.. తామిద్దరం మాత్రం ఎప్పటికీ తోబుట్టువుల్లాగే ఉండాలని జ్యోత్స్న దీపను కోరుతుంది. అందుకు దీప కూడా అంగీకరించి ఆమె చేతిలో చేయి వేస్తుంది. తమ స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని చెబుతుంది.ఈ దృశ్యాన్ని చూసిన పారు షాక్ అవుతుంది. అయితే దాస్ మాత్రం తన కూతురు నిజం చెప్పబోతున్నందుకు సంతోషిస్తాడు. "నీ కూతురు నిజం చెప్పేలా ఉంది" అని పారు చెప్పగా.. ఇన్నాళ్లూ తన కూతురు ఏదైనా చేయబోతే వద్దని చెప్పేవాడినని, కానీ మొదటిసారి ఆమెను ఆపాలని తనకు అనిపించడం లేదని దాస్ అంటాడు.

అయితే నిజాలు బయటకు వస్తే శివన్నారాయణ ఊరుకోడని పారు భయపడుతుంది. జ్యోత్స్న పెళ్లి తన చావుకొచ్చిందని బాధపడుతుంది. నువ్వు అయోమయంలో ఉన్న తండ్రివి.. కూతురిని కాదనలేవు, తల్లిని కాదనలేవు అంటూ దాస్‌ను నిలదీస్తుంది.జ్యోత్స్న ఏమైనా చేసుకోనివ్వు కానీ.. నువ్వు మాత్రం ఆమెకు తండ్రినని చెప్పకూడదని దాస్ చేత పారు ఒట్టు వేయించుకుంటుంది. నువ్వు నోరు విప్పడానికి వీల్లేదని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇంతలో ముహూర్త సమయం రావడంతో జ్యోత్స్న సూరజ్ పక్కన వచ్చి కూర్చుంటుంది. ఇది చూసి దశరథ, శివన్నారాయణ ఎంతో సంతోషిస్తారు.మాలిని అక్కడి నుంచి లేచి వెళ్లబోతుండగా కాంచన ఆమెను అడ్డుకుంటుంది. నువ్వు ఎక్కడికీ వెళ్లకుండా చూసుకోవాలని తన తండ్రి దీపకు చెప్పారని, దీప బాధ్యతను తానే తీసుకున్నానని కాంచన చెబుతుంది.మాలిని మాత్రం తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, తన కోడలు కష్టపడుతుంటే సాయం చేయడానికి వెళ్దామని అనుకున్నానని చెబుతుంది. దాంతో కాంచన ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే మంచిదని హెచ్చరిస్తుంది.దీనికి మాలిని కూడా తగ్గకుండా కౌంటర్ ఇస్తుంది. నీకు కాళ్లు, చేతులు పనిచేయకపోయినా అందరినీ బాగానే కంట్రోల్ చేస్తున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఇది పరాయి ఇల్లు కావచ్చు కానీ దీప మాత్రం దీనిని తన సొంతిల్లుగా భావిస్తుందని కాంచన చెబుతుంది. సుమిత్ర, దశరథలను తన సొంత తల్లిదండ్రులుగా దీప చూసుకుంటోందని వివరిస్తుంది.మాలిని మాత్రం "నీకు ఈ పెళ్లి నచ్చకపోతే చెప్పు.. పెళ్లి ఆపేద్దాం" అని పారుతో అంటుంది. ఈ మాటలు విన్న దాస్ సీరియస్ అవుతాడు. తమ మంచితనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, వచ్చారు కాబట్టి భోజనం చేసి వెళ్లాలని అంటాడు.

శివన్నారాయణ ఇంట్లో తన కొడుకుకు స్థానం లేదని, అందరినీ పిలిచినట్టే భోజనం చేసి వెళ్లిపోవాలని, ఇక్కడ తనది అని లేదా సొంతం అని చెప్పుకోవడానికి ఏమీ లేదని మాలిని ఆగ్రహంగా చెబుతుంది. దీంతో దాస్ కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ తనకు మాలిని కంటే కొంత విలువ ఎక్కువగానే ఉందని అంటాడు.తన కొడుకు కూడా శివన్నారాయణ మాయలోనే ఉన్నాడని మాలిని వ్యాఖ్యానిస్తుంది. మీరంతా ఆ భ్రమల నుంచి బయటకు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తుంది.

Karthika Deepam 2 Today Episode August 27th పెళ్లి మండపంలో జ్యోత్స్న బాంబు.. దీప అసలు తల్లిదండ్రులు వీరే!

ఇక జ్యోత్స్న మెడలో తాళి పడిన వెంటనే, ఏడడుగులు పూర్తిగా నడవకముందే పెళ్లి మండపం కిందకు వచ్చేస్తుంది. తాను కొంతమందికి రుణపడి ఉన్నానని, ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అందరి ముందు చెబుతుంది.జ్యోత్స్న మాటలతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు. అయితే ఆమె చెప్పబోయే విషయం అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేస్తుంది.దీపకు తాను రుణపడి ఉన్నానని జ్యోత్స్న చెబుతుంది. దీపకు అమ్మానాన్న లేరని చాలామంది నిందించారని, ఆ మాటలు అన్నవారిలో తాను కూడా ఒకరినని అంగీకరిస్తుంది. కానీ అసలు నిజం వేరని చెబుతుంది.దీపకు అమ్మానాన్న ఉన్నారని జ్యోత్స్న సంచలన ప్రకటన చేస్తుంది.శ్రీధర్ వాళ్లు ఎక్కడో ఒకచోట ఉంటారని చెప్పగా.. వాళ్లు ఎవరో తనకు తెలుసని జ్యోత్స్న అంటుంది. దీంతో వాళ్లు ఎవరు అని సుమిత్ర ప్రశ్నిస్తుంది.వెంటనే జ్యోత్స్న అసలు ట్విస్ట్ బయటపెడుతుంది. "వాళ్లు ఇక్కడే ఉన్నారు. దీప అమ్మానాన్న ఈ పెళ్లిలోనే ఉన్నారు" అంటూ సుమిత్ర, దశరథ, దీపలను పిలుస్తుంది.

దీప చేతిని సుమిత్ర, దశరథల చేతుల్లో పెట్టి.. "మీరే దీప అమ్మానాన్న.. దీపే మీ కన్నకూతురు" అని జ్యోత్స్న చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.దీపకు తన తల్లి ఎవరో ముందే తెలుసని జ్యోత్స్న చెబుతుంది. అయితే అప్పటికే సుమిత్ర స్థానంలో మరొకరు ఉండటంతో తాను మీ కూతురినని చెప్పుకోలేని పరిస్థితిని దీప ఎదుర్కొందని వివరిస్తుంది.అయినా తన తల్లిపై ప్రేమను దీప ఎప్పుడూ చంపుకోలేదని చెబుతుంది. సుమిత్రకు క్యాన్సర్ వచ్చిన సమయంలో ఆమెను కాపాడేందుకు బోన్‌మ్యారో ఇచ్చింది దీపేనని జ్యోత్స్న వెల్లడిస్తుంది.అంతేకాదు, తాను గర్భవతిగా ఉన్న సమయంలో బోన్‌మ్యారో ఇస్తే కడుపులోని బిడ్డకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించినా.. "నా బిడ్డకు ఏం జరిగినా పర్వాలేదు, నా కన్నతల్లిని కాపాడుకోవాలి" అనే భావంతో దీప బోన్‌మ్యారో డొనేట్ చేసిందని చెబుతుంది.ఈ విషయం విని అక్కడున్న వారంతా మౌనంగా, షాక్‌లో ఉండిపోతారు.ఇలాంటి కూతురు పురాణాల్లో, పుస్తకాల్లో తప్ప ఎక్కడా కనిపించదని జ్యోత్స్న అంటుంది. ఇంతటి త్యాగం చేసినా దీప ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉందని చెబుతుంది. తన కన్నతల్లి ఎదురుగానే ఉన్నప్పటికీ "అమ్మా" అని పిలవలేని పరిస్థితిని దీప అనుభవించిందని వివరిస్తుంది.

ఒక మంచి తల్లి ఎలా ఉండాలో సుమిత్రను, ఒక మంచి కూతురు ఎలా ఉండాలో దీపను ఉదాహరణగా చూపించవచ్చని జ్యోత్స్న అంటుంది.ఇంతలో దశరథ కూడా సంచలన నిజాన్ని అంగీకరిస్తాడు. "దీపే మన సొంత బిడ్డ" అని చెప్పడంతో మరోసారి అందరూ షాక్ అవుతారు.దీప అనాథ కాదని, శివన్నారాయణ మనవరాలని, తన అసలైన వారసురాలని దశరథ ప్రకటిస్తాడు."నువ్వు నా కూతురివా?" అంటూ సుమిత్ర కన్నీళ్లతో దీపను హత్తుకుంటుంది. తల్లి-కూతుళ్ల భావోద్వేగ క్షణం చూసి అక్కడున్నవారంతా కదిలిపోతారు.చివరగా జ్యోత్స్న.. తాను కొంత రుణం తీర్చుకున్నానని చెబుతుంది. అందరి ముందూ సుమిత్రను "అమ్మ" అని పిలవాలని దీపను కోరుతుంది. దీంతో దీప, సుమిత్రల బంధానికి కొత్త అర్థం వస్తుంది. ఇంతటి భావోద్వేగ ట్విస్ట్‌తో Karthika Deepam 2 August 27 Episode 762 ముగుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews