Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Non Smokers : ఇది మీకు తెలుసా..? లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50% మంది స్మోకర్లు కాదట..!

Non Smokers : ఇది మీకు తెలుసా..? లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50% మంది స్మోకర్లు కాదట..!

TheTeluguNews 3 days ago

Non Smokers : భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధి ప్రధానంగా ధూమపానం చేసే వారికే వస్తుందని చాలామంది భావించేవారు.

అయితే తాజా వైద్య విశ్లేషణలు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. దేశంలో నమోదవుతున్న లంగ్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 50 శాతం మంది అసలు ధూమపానం చేయని వారేనని ఘాజియాబాద్‌లోని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మనీష్ సింఘాల్ వెల్లడించారు. ఈ విషయం ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. వాయు కాలుష్యం, పాసివ్ స్మోకింగ్, జన్యుపరమైన మార్పులు వంటి అనేక కారణాలు ప్రస్తుతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలుగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు.

Non Smokers : ఇది మీకు తెలుసా..? లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50% మంది స్మోకర్లు కాదట..!

Non Smokers పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తోంది? నిపుణులు చెప్పిన ప్రధాన కారణాలు

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో లంగ్ క్యాన్సర్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని డాక్టర్ మనీష్ సింఘాల్ వివరించారు. మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది ధూమపానం చేసే వారు ఉన్నప్పటికీ, ఎప్పుడూ సిగరెట్ లేదా బీడీ తాగని మహిళలు, యువతలో కూడా ఈ వ్యాధి పెరుగుతుండటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ధూమపానం ఒక్కటే కారణం కాదని, పలు పర్యావరణ మరియు జీవశాస్త్ర సంబంధిత అంశాలు కూడా ఈ క్యాన్సర్‌కు దారితీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Non Smokers లంగ్ క్యాన్సర్‌కు దారితీసే ప్రధాన కారణాలు ఇవే

వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే తీవ్రమైన వాయు కాలుష్యం (Air Pollution) ఇతరులు కాల్చిన సిగరెట్ పొగను పీల్చడం లేదా పాసివ్ స్మోకింగ్ (Second-hand Smoking) ఇళ్లలో ఏర్పడే రేడాన్ వాయువు (Radon Gas) ప్రభావం రసాయన కాలుష్యం శరీరంలో జరిగే జన్యుపరమైన మార్పులు (Genetic Mutations) ఈ కారణాల వల్ల ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. భారతీయుల్లో చిన్న వయస్సులోనే ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు దాదాపు పదేళ్లు ముందుగానే, అంటే సుమారు 50 ఏళ్ల వయస్సులోనే లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారని డాక్టర్ మనీష్ సింఘాల్ తెలిపారు. భారతీయ పురుషుల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించకపోవడమే అతిపెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు. ప్రారంభ లక్షణాలను సాధారణ దగ్గు లేదా శ్వాస సంబంధిత ఇబ్బందులుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల, దాదాపు 50 శాతానికి పైగా కేసులు మూడో లేదా నాలుగో దశ (Stage 3 లేదా Stage 4)కు చేరిన తర్వాతే బయటపడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చికిత్స మరింత క్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి

మందులు వాడినా తగ్గని దీర్ఘకాలిక దగ్గు , దగ్గేటప్పుడు లేదా నోటి నుంచి రక్తం రావడం , ,కారణం లేకుండానే వేగంగా బరువు తగ్గడం , ఆకలి తగ్గిపోవడం, నడిచినా లేదా చిన్నపాటి శ్రమ చేసినా ఆయాసం రావడం , ,ఛాతీలో నిరంతర నొప్పి లేదా అసౌకర్యం ,ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆంకాలజిస్ట్ లేదా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించాలని డాక్టర్ సూచించారు. ముఖ్యంగా అధిక ప్రమాదంలో ఉన్నవారు ప్రతి సంవత్సరం లో-డోస్ సీటీ స్కాన్ (Low-dose CT Scan) చేయించుకుంటే వ్యాధిని తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆధునిక చికిత్సలతో పెరిగిన ఆశలు

గతంలో లంగ్ క్యాన్సర్ చికిత్స అంటే ప్రధానంగా కీమో థెరపీ, రేడియేషన్ మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే వైద్య రంగంలో వచ్చిన పురోగతితో ఇప్పుడు ప్రిసిషన్ మెడిసిన్ (Precision Medicine) కొత్త ఆశలను కల్పిస్తోంది. బయోమార్కర్ టెస్టింగ్ ద్వారా రోగిలో ఉన్న EGFR, ALK, ROS1 వంటి జన్యు మార్పులను గుర్తించి, వాటికి అనుగుణంగా టార్గెటెడ్ థెరపీ (Targeted Therapy) అందిస్తున్నారు. అలాగే శరీరంలోని రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచే ఇమ్యునోథెరపీ (Immunotherapy) కూడా మంచి ఫలితాలను ఇస్తోందని డాక్టర్ మనీష్ సింఘాల్ తెలిపారు.ఈ ఆధునిక చికిత్సల వల్ల రోగుల జీవితకాలం పెరగడంతో పాటు, నాణ్యమైన సాధారణ జీవితం గడిపే అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయని ఆయన వివరించారు.అయితే దగ్గు, రక్తంతో దగ్గు, ఆకస్మిక బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews