Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rakhi Festival 2026 : రక్షాబంధన్ స్పెషల్.. శ్రీరాముడికి రాఖీ కట్టింది ఎవరు..?

Rakhi Festival 2026 : రక్షాబంధన్ స్పెషల్.. శ్రీరాముడికి రాఖీ కట్టింది ఎవరు..?

TheTeluguNews 17 hrs ago

Rakhi Festival 2026 : సనాతన ధర్మంలో శ్రీరాముని జీవన ప్రస్థానానికి సంబంధించి ఎన్నో పవిత్రమైన గాథలు ఉన్నాయి. వాటిలో శ్రీరామచంద్రుని అద్భుత లీలలు, ధర్మ నిరతి గురించి దాదాపు అందరికీ తెలుసు.

అయోధ్యాధిపతి దశరథ మహారాజుకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నలుగురు కుమారులు జన్మించారనే విషయం లోకవిదితం. కానీ, శ్రీరాముడికి ఒక అక్క (పెద్ద సోదరి) కూడా ఉందన్న విషయం మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. ఆమె పేరే శాంతా దేవి. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా శాంతా దేవి తన ముద్దుల తమ్ముళ్ల మణికట్టుకు అనురాగంతో రాఖీ కట్టేదని పురాణ కథనాలు, భక్తుల ప్రగాఢ విశ్వాసం చెబుతున్నాయి. అయోధ్యలోని సాకేత్ భవన్‌కు చెందిన మహంత్ సీతారామ్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అసలు శాంతా దేవి ఎవరు? ఆమె కథేంటి? అనే ఆసక్తికర విశేషాలు పరిశీలిద్దాం.

Rakhi Festival 2026 : రక్షాబంధన్ స్పెషల్.. శ్రీరాముడికి రాఖీ కట్టింది ఎవరు..?

Rakhi Festival 2026 దశరథుని పుత్రిక శాంతా దేవి.. అంగదేశానికి దత్తపుత్రికగా ఎలా వెళ్లారు?

పురాణాల ప్రకారం, దశరథ మహారాజు, కౌసల్యా దేవి దంపతులకు నలుగురు కుమారులు జన్మించడానికంటే ముందే ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు ‘శాంత’ అని నామకరణం చేశారు. శ్రీమద్భాగవతంలోని తొమ్మిదవ స్కంధంలో శాంతా దేవి ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. దశరథ మహారాజు తన ప్రాణస్నేహితుడు, సంతానలేమితో బాధపడుతున్న అంగదేశ పాలకుడు రోమపాదునికి తన ముద్దుల కుమార్తె శాంతను దత్తత ఇచ్చారు. దీంతో ఆమె అంగదేశపు రాకుమారిగా పెరిగింది.ఆ తర్వాత కాలంలో, అంగదేశంలో భయంకరమైన కరువు కాటకాలు సంభవించినప్పుడు, అక్కడి దుర్భిక్షాన్ని నివారించేందుకు తపోధనుడైన ఋష్యశృంగ మహర్షిని రాజ్యానికి ఆహ్వానించారు. ఆ మహానుభావుడి పాదస్పర్శతో అంగదేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కరువు తీరి సుభిక్షంగా మారింది. రోమపాదుడు సంతోషంతో తన దత్తపుత్రిక శాంతా దేవిని ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించారు. ఈ విధంగా శాంత, ఋష్యశృంగుల బంధం ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Rakhi Festival 2026 పుత్రకామేష్టి యజ్ఞం.. రాముడు, సోదరులకు శాంతా దేవి రాఖీ బంధం!

అయోధ్యలో పుత్రసంతానం లేక చింతిస్తున్న దశరథ మహారాజుకు, అల్లుడైన ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యజ్ఞం చేయించాల్సిందిగా గురువులు సూచించారు. ఋష్యశృంగ మహర్షి అత్యంత నిష్ఠతో నిర్వహించిన ఆ యజ్ఞ ఫలితంగానే దశరథునికి శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.మహంత్ సీతారాం దాస్ వివరించిన వివరాల ప్రకారం.. ఈ విధంగా జన్మించిన నలుగురు తమ్ముళ్లపై శాంతా దేవికి అపారమైన వాత్సల్యం ఉండేది. రక్షాబంధన్ పండుగ వేళ తన ప్రియమైన సోదరులైన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల క్షేమాన్ని కాంక్షిస్తూ వారి చేతులకు శాంతా దేవి స్వయంగా రక్షాసూత్రాన్ని (రాఖీ) కట్టేదని ప్రాచీన సంప్రదాయం చెబుతోంది. అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి, ఆత్మీయ రక్షణకు ప్రతీకగా ఈ రాఖీ బంధం నిలిచింది. వివిధ రామాయణ సంప్రదాయాలు, ప్రాంతీయ గ్రంథాల్లో శాంతా దేవి వృత్తాంతంపై స్వల్ప భిన్న కథనాలు ఉన్నప్పటికీ, శ్రీరాముని సోదరిగా శాంతా దేవి స్థానం విశిష్టమైనదిగా నిలిచిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews