Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK Vijay : పవన్ కళ్యాణ్ తో పాటు ఎవ్వరూ రాజకీయాల్లో చెయ్యని ప్రయోగం చేస్తున TVK విజయ్..!

TVK Vijay : పవన్ కళ్యాణ్ తో పాటు ఎవ్వరూ రాజకీయాల్లో చెయ్యని ప్రయోగం చేస్తున TVK విజయ్..!

TheTeluguNews 6 months ago

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ గురించే చర్చ జరుగుతోంది. తన సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పి మరీ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఎవరూ ఊహించని మాస్టర్ ప్లాన్ వేశారు.

సాధారణంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు ఒక సురక్షితమైన నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడి నుండి మాత్రమే పోటీ చేస్తారు. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా తన అరంగేట్రంలోనే రెండు నియోజకవర్గాల నుండి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో రెండు చోట్ల పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో నడుస్తూ అటు చెన్నైలోని పెరంబూర్, ఇటు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

TVK Vijay : పవన్ కళ్యాణ్ తో పాటు ఎవ్వరూ రాజకీయాల్లో చెయ్యని ప్రయోగం చేస్తున TVK విజయ్..!

తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే ఇలా ఒక అగ్రనేత రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1991లో జయలలిత బర్గూర్ మరియు కంగేయం నుండి పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయ్ మాత్రమే అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో తన పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ మీద నమ్మకంతో పాటు, తిరుచ్చి ఈస్ట్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం విజయ్ వ్యక్తిగత గెలుపు కోసమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ఒకేసారి రెండు కీలక స్థానాల్లో పోటీ చేయడం ద్వారా తాను రాజకీయాలను ఎంత సీరియస్‌గా తీసుకున్నాననే సంకేతాన్ని విజయ్ ప్రజల్లోకి పంపారు. అధికార డీఎంకే మరియు ప్రతిపక్ష అన్నా డీఎంకే వంటి బలమైన పార్టీలు ఉన్న తరుణంలో, విజయ్ చేస్తున్న ఈ ప్రయోగం తమిళ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక స్టార్ హీరోగా తనకున్న ఇమేజ్ ఓట్లుగా మారుతుందా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. పవన్ కళ్యాణ్ మాదిరిగా విజయ్ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధపడ్డారు. ఈ డ్యూయల్ రోల్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఒక కొత్త పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేయడం అనేది విజయ్ లోని రాజకీయ ధైర్యానికి నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TheTeluguNews