Dailyhunt
175km రేంజ్ తో కొత్త TVS iQube S 4.7 kWh మోడల్ లాంచ్...ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ధర , ఫీచర్స్

175km రేంజ్ తో కొత్త TVS iQube S 4.7 kWh మోడల్ లాంచ్...ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ధర , ఫీచర్స్

Times Now Telugu 4 days ago

భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని TVS సంస్థ iQube S కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది . ఈ మోడల్‌లో 4.7 kWh సామర్థ్యం గల బ్యాటరీతో అందిస్తున్నారు.ఇది ఫుల్ ఛార్జ్ సుమారు 175 కి.మీ.

రేంజ్ అందిస్తుంది . ఇది ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ స్కూటర్ నగర ప్రయాణాలకు సరైన ఎంపికగా నిలుస్తుంది.ఈ కొత్త వెర్షన్ రోజువారీ ప్రయాణాలు , నగర జీవనశైలికి అనుగుణంగా రూపొందించారు . ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ లో TVS ఇప్పటికే తన స్థానాన్ని స్ట్రాంగ్ గా నిలుపుకున్నప్పటికీ ఈ తాజా అప్‌డేట్ ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. పర్యావరణహిత ప్రయాణం, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఆధునికతకు అనుగుణమైన డిజైన్‌తో iQube S ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో బెస్ట్ ఎంపిక గా నిలుస్తుంది
TVS iQube S 4.7 kWh
TVS iQube S 4.7 kWh వెర్షన్ భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో వినియోగదారుల అంచనాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించారు . ఈ స్కూటర్‌లో 4.7 kWh లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 175 km వరకు ప్రయాణాన్ని అందిస్తుంది . BLDC హబ్ మౌంటెడ్ మోటార్‌తో 4.4 kW పీక్ పవర్ , 140 Nm టార్క్ అందిస్తుంది .దీని వల్ల నగర ప్రయాణాలు సులభతరం అవుతాయి. టాప్ స్పీడ్ 82 kmph. ఈ స్కూటర్ 0-40 కి.మీ. వేగాన్ని కేవలం 4.3 సెకన్లలో సాధిస్తుంది.

ఫీచర్స్
7 అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే, Alexa వాయిస్ అసిస్టెంట్, USB ఛార్జ్ పోర్ట్ , టర్న్-బై-టర్న్ నావిగేషన్, రైడ్ స్టాటిస్టిక్స్, రిమోట్ ఛార్జ్ స్టేటస్ వంటి 118+ స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 32 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, సౌకర్యవంతమైన సీటింగ్ లాంటివి వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

భద్రతా పరంగా AIS 156 సర్టిఫికేషన్, క్రాష్/ఫాల్ అలర్ట్స్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, రెజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. బ్యాటరీ IP67 సర్టిఫికెట్ ఉంటుంది. ఛార్జింగ్ చూసుకుంటే 0-80% వరకు కేవలం 4 గంటల్లో ఛార్జ్ అవుతుంది.

టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ రియర్ షాక్ అబ్జార్బర్ఉంటాయి . ముందు 220 mm డిస్క్ బ్రేక్, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్ వంటి ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచుతాయి . 128.8 kg బరువు, 157 mm గ్రౌండ్ క్లియరెన్స్, 770 mm సీటు ఎత్తు, 1301 mm వీల్‌బేస్ ఈ స్కూటర్‌ను నగర ప్రయాణాలకు అనువైనదిగా నిలుపుతాయి .

ధర
ఈ వెర్షన్ హైదరాబాద్ ఆన్ రోడ్ ధర Rs 166933/-
TVS iQube S 4.7 kWh వెర్షన్ ఆధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు కంఫర్ట్ అందిస్తూ భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బెస్ట్ ఎంపికగా నిలువనుంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu