Dailyhunt
200MP కెమెరా, 7000 mAh బ్యాటరీతో వివో V70 FE స్మార్ట్‌ఫోన్‌ లాంచ్...ధర,ప్రాసెసర్,ఫీచర్స్ వివరాలు

200MP కెమెరా, 7000 mAh బ్యాటరీతో వివో V70 FE స్మార్ట్‌ఫోన్‌ లాంచ్...ధర,ప్రాసెసర్,ఫీచర్స్ వివరాలు

Times Now Telugu 6 days ago

వివో కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్తగా Vivo V70 FE స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా ఫోటోగ్రఫీ ఇష్టపడేవారి కోసం రూపొందించారు .

200MP ప్రధాన కెమెరా ఆధునిక AI ఫీచర్లతో ఇది అత్యుత్తమ చిత్రాలను అందించగలదు. భారీ బ్యాటరీ తో లాంగ్ టైం వినియోగాన్ని అందిస్తుంది. కొత్తగా అందిస్తున్న డార్క్ నెస్ గ్లో టెక్నాలజీ ద్వారా ఫోన్ వెనుక భాగం తక్కువ వెలుతురు లోకూడా గ్లో అవుతుంది.OLED డిస్‌ప్లే తో అధిక బ్రైట్‌నెస్ , MediaTek చిప్ సెట్ తో వేగవంతమైన పెర్ఫార్మన్స్ అందిస్తుంది. లాంగ్ టైం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ,సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. Vivo V70 FE వినియోగదారులకు పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ , ఆధునిక డిజైన్, విశ్వసనీయతను అందించే స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోంది.
వివో V70 FE స్మార్ట్‌ఫోన్‌
వివో తాజాగా భారతీయ మార్కెట్లో Vivo V70 FE స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా కెమెరా పెర్ఫార్మన్స్ , శక్తివంతమైన ప్రాసెసర్, లాంగ్ టైం బ్యాటరీ కెపాసిటితో వినియోగదారులను ఆకర్షిస్తోంది.

6.83 అంగుళాల 1.5K అల్ట్రా క్లియర్ OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది గేమింగ్ , వీడియో స్ట్రీమింగ్‌లో స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది.

ప్రాసెస్సర్ గా MediaTek Dimensity 7360-Turbo చిప్ సెట్ తో పనిచేస్తుంది .ఇది స్పీడ్ పెర్ఫార్మన్స్ , మల్టీటాస్కింగ్‌కు అనువుగా ఉంటుంది.
కెమెరా సెగ్మెంట్ లో 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. వీడియో కాల్స్ సెల్ఫీ లకోసం 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది .

బ్యాటరీ చుస్తే 7,000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ తో లాంగ్ టైం వినియోగాన్ని అందిస్తుంది. 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
స్టోరేజ్ పరంగా 8GB RAM + 128GB , 8GB RAM + 256GB ,12GB RAM+256GB స్టోరేజ్ వేరియెంట్స్ ఉంటాయి . ఆపరేటింగ్ సిస్టమ్‌గా OriginOS ఆధారంగా Android 16 తో పనిచేస్తుంది . ఇది స్మూత్ UI , రెగ్యులర్ అప్‌డేట్స్‌తో వస్తుంది.

సేఫ్టీ పరంగా IP68 & IP69 డస్ట్ ,వాటర్ ప్రొటెక్షన్ , ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, పేస్ Unlock , రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G సపోర్ట్, Wi-Fi 6, Bluetooth 5.3 ,USB Type-C పోర్ట్ ఉన్నాయి.రంగులలో Northern Lights Purple , Monsoon Blue అందుబాటులో ఉన్నాయి.
వేరియంట్ ధరలు
8GB RAM + 128GB వేరియంట్ ధర Rs 37,999 /-
8GB RAM + 256GB వేరియంట్ ధర Rs 40,999 /-
12GB RAM + 256GB వేరియంట్ ధర Rs 44,999. /-
Vivo V70 FE పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ , ఆధునిక కెమెరా సిస్టమ్, విశ్వసనీయ భారీ బ్యాటరీతో వినియోగదారులకు సరైన ఎంపికగా నిలుస్తోంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu