Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2026 లో 10 లక్షలోపు ధరలో ఉన్న 5 బెస్ట్  7 సీటర్ కార్ లు...ధరలు,మైలేజ్,ఫీచర్స్

2026 లో 10 లక్షలోపు ధరలో ఉన్న 5 బెస్ట్ 7 సీటర్ కార్ లు...ధరలు,మైలేజ్,ఫీచర్స్

Times Now Telugu 1 month ago

భారతదేశంలో ఫ్యామిలీ ప్రయాణాలకు పర్ఫెక్ట్ గా ఉండే 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సీటింగ్, సౌకర్యం, మైలేజ్ పెర్ఫార్మన్స్ అందించే వాహనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Nissan , Renault , Maruti , Mahindra , Toyota లాంటి ప్రముఖ కంపెనీలు 10 లక్షలోపు ధరలో ప్రముఖ మోడల్స్ అందిస్తున్నారు. ఇవి కుటుంబ ప్రయాణాలకు , రోజువారీ ఉపయోగానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి . వీటిలో విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీటింగ్, మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్లు తక్కువ ఖర్చుతో విలువకు తగ్గ ఫీచర్లు అందిస్తూ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి.
రెనో ట్రైబర్ 2026
1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 72 PS పవర్‌, 96NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అన్ని వేరియంట్లలో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ , టాప్ వేరియంట్ లో ఆటోమేటిక్ (AMT) ట్రాన్స్మిషన్ ఉంటాయి .

ఫీచర్స్
5 నుండి 7 సీటర్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్, 625 లీటర్ల వరకు బూట్ స్పేస్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటో A/C , రియర్ వెంట్‌లు , 20.32 cm టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఆపిల్ కార్ ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 17.78 cm TFT డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి .
సేఫ్టీ లో 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ , 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS + EBD, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 182 mm గ్రౌండ్ క్లియరెన్స్, 50 kg కెపాసిటీ రూఫ్ రైల్స్, 38.1 cm డ్యూయల్ టోన్ స్టైల్డ్ వీల్స్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో ఫ్రంట్ డిస్క్ , రియర్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.
ధరలు
దీని ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర Rs 5.80 లక్షలు
నిస్సాన్ గ్రావైట్
ఇది 7-సీటర్ MPV. 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో 72 PS పవర్ , 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ , EZ-Shift AMT ఉన్నాయి.ఇది 19.6 kmpl మైలేజ్ ఇస్తుంది.

ఫీచర్స్
17.78 cm డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 20.32 cm టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, రియర్ కెమెరా ప్రొజెక్షన్ ,ఎయిర్ ప్యూరీఫైర్ ,వైర్ లెస్ ఛార్జింగ్,రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.
LED DRLs, క్రిస్టల్ ఎడ్జ్ LED టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ R15ఫ్లెక్స్ వీల్స్ ఉన్నాయి.182mm అధిక గ్రౌండ్ క్లియరెన్సు కలిగి ఉంటుంది.
సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్,ఫ్రంట్ & బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు,ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం,హిల్ స్టార్ అసిస్ట్,ESC, , HSA, ABS + EBD వంటి 21కి పైగా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.40L ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంటుంది.
ధరలు
దీని ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర ₹5.65 లక్షలు
మారుతి సుజుకి ఎర్టిగా
ఇది K15C ,1.5L స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ తో 7.8KW పవర్ ,139Nm టార్క్ ను అందిస్తుంది.5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్,6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ ఉంటుంది.ఫ్యాక్టరీ ఫిట్టేడ్ CNG కూడా ఉంటుంది.

ఫీచర్స్
17.78 స్మార్ట్ ప్లే ప్రో ,TFT మల్టీ ఇన్ఫర్మేషన్ కలర్ డిస్ప్లే ,క్రూజ్ కంట్రోల్ ఉంటుంది.నావిగేషన్ ,హార్ట్ టెక్ ప్లాట్ ఫారం ,6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది.ABS తో EBD,టైర్ ప్రెసర్ మోనిటరింగ్ సిస్టం ఉంటుంది.
4,395 mm పొడవు ,1,735 mm వెడల్పు ,1,690 mm ఎత్తు ఉంటుంది.45L పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీనిలో వేరియంట్స్ LXI, ఎర్టిగా VXI, ఎర్టిగా ZXI, ఎర్టిగా ZXI+, ఎర్టిగా CNG ఉంటాయి .
మారుతీ సుజికి ఎర్టిగా పెట్రోల్ వేరియంట్స్ 20.51 kmpl మైలేజ్ ఇస్తాయి.CNG వేరియంట్స్ 26.11 km/kg ఇస్తుంది.
ధరలు
దీని ప్రారంభ ఏ షో రూమ్ ధర Rs 8.80 లక్షలు
Toyota Rumion
ఇది స్టైలిష్ 7 సీటర్ MPV కుటుంబ ప్రయాణాలకు అనువైన వాహనం. 1.5 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 103 bhp పవర్,138 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ , 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ సుమారు 20 km/l మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ 26 km/kg వరకు ఇస్తుంది.

ఫీచర్స్
విశాలమైన ఇంటీరియర్, డ్యూయల్ టోన్ సీటింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. Toyota i-Connect టెక్నాలజీ ద్వారా స్మార్ట్ కనెక్టివిటీ ఉంటుంది . సేఫ్టీ పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABS with EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
ధరలు
దీని ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర Rs 9.56 లక్షలు
Mahindra Bolero Neo
ఇది కాంపాక్ట్ SUV బలమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌ తో వస్తుంది .1.5 లీటర్ mHawk100 డీజిల్ ఇంజిన్ , 100 bhp పవర్ , 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మైలేజ్ సుమారు 17-18 km/l ఇస్తుంది. 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది.

ఫీచర్స్
ఇంటీరియర్‌లో 7 సీటర్ లేఅవుట్, డ్యూయల్ టోన్ డిజైన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Bluetooth, USB, AUX కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. BlueSense మొబైల్ యాప్ ద్వారా కనెక్టివిటీ, Eco Mode ద్వారా ఇంధన సామర్థ్యం, Micro-Hybrid టెక్నాలజీ ద్వారా ఆటో స్టార్ట్/స్టాప్ ఫీచర్ ఉంటుంది .
సేఫ్టీ పరంగా Bolero Neo లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS with EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, హై-స్ట్రెంగ్త్ బాడీ స్ట్రక్చర్, మరియు సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
ధరలు
దీని ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర Rs 8.85 లక్షలు

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu