2026లో బైక్ వినియోగదారుల ముందున్న ప్రధాన ప్రశ్న ఎలక్ట్రిక్ బైక్‌లు రోజువారీ ప్రయాణాలకు సరైన ఎంపికనా? లేక పెట్రోల్ బైక్‌లే ఇంకా మెరుగైనవా? నగర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ బైక్‌లు పర్యావరణానికి మేలు చేస్తూ, తక్కువ శబ్దంతో, సాఫీగా నడుస్తాయి.
వీటిని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ ఫీచర్లు అందిస్తున్నాయి. పెట్రోల్ బైక్‌లు ఎక్కువ మైలేజ్ , స్పీడ్ పెట్రోల్ ఫిల్లింగ్ , దూర ప్రయాణాలకు అనువైన పెర్ఫార్మన్స్ తో ప్రయాణికులకు ఆకర్షణీయంగా ఉంటున్నాయి . ఈ రెండు ఎంపికలు ప్రయాణ అవసరాలు , రన్నింగ్ కాస్ట్ , జీవనశైలి ఆధారంగా ఉంటుంది .ఎలక్ట్రిక్ బైక్ పెట్రోల్ బైక్ లు కొనుగోలు ధర నిర్వహణ ఖర్చు , మైలేజ్ పరంగా,ఆర్ధికంగా బెస్ట్ గా నిలుస్తుందో Pros & cons చూద్దాం
రోజువారీ ప్రయాణం కోసం
ఎలక్ట్రిక్ బైక్‌లు చాలా స్మూత్ గా నడుస్తాయి. ఇవి ఇది ట్రాఫిక్ కి అనుకూలంగా పవర్ ని స్పీడ్ గా అందిస్తాయి.గేర్ మార్చాల్సిన అవసరం ఉండదు . నిశ్శబ్దమైన ప్రయాణాన్ని అందిస్తుంది . ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు, తరచుగా పెట్రోల్ బంక్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు.ఛార్జింగ్‌కి సాధారణంగా చార్జర్ ని బట్టి 1.5 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఈ ఒక్క విషయంలో నే పెట్రోల్ బైక్‌లకు సమయం ఆదా అవుతుంది .
పెట్రోల్ బైక్‌లు నగర దూర ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటాయి. ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 250-500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కొన్ని నిమిషాల్లోనే పెట్రోల్ నింపుకోవచ్చు. పెట్రోల్ బైక్‌లు అధిక సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. వీటికి ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో ప్రారంభ కొనుగోలు ధర కూడా చాల తక్కువగా ఉంటుంది.
మెయింటన్స్ ఖర్చు
ఎలక్ట్రిక్ బైక్‌లలో బ్యాటరీ ఉంటుంది . వీటిలో ఇంజిన్ ఆయిల్, క్లచ్ ప్లేట్లు లేదా స్పార్క్ ప్లగ్‌లు ఉండవు. వీటిలో స్పేర్ పార్ట్స్ చాల తక్కువగా ఉంటాయి. సర్వీస్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చులు సంవత్సరానికి ₹1,000-₹2,500 వరకు ఉంటాయి . పెట్రోల్ బైక్‌లలో ఇంజిన్, ఆయిల్, క్లచ్ ప్లేట్లు లేదా స్పార్క్ ప్లగ్‌లు లాంటి స్పేర్ పార్ట్స్ ఎక్కువగా ఉండటంవలన నిర్వహణ ఖర్చులు సంవత్సరానికి వాడకాన్ని బట్టి ₹5,000-₹10,000 వరకు అవుతాయి
రన్నింగ్ కాస్ట్
ఎలక్ట్రిక్ బైక్‌లలో ముఖ్యమైన బెనిఫిట్ ఖర్చు. ఎలక్ట్రిక్ బైక్ నడపడానికి కిలోమీటరుకు కేవలం ₹0.15 నుండి ₹0.30 వరకు మాత్రమే ఖర్చవుతుంది. పెట్రోల్ బైక్‌లు నడపడానికి కిలోమీటరుకు ₹2 నుండి ₹3 వరకు ఖర్చవుతాయి. ఈ ఖర్చులను బట్టి ప్రతిరోజూ ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ బైక్ తో సంవత్సరానికి ₹20,000 నుండి ₹40,000 వరకు ఆదా అడావుతుంది . ఇది మధ్యతరగతి వినియోగదారులకు ఆర్ధికంగా చాల బెనిఫిట్ .
రేంజ్ & వినియోగం
ఎలక్ట్రిక్ బైక్‌లు సాధారణంగా ఫుల్ ఛార్జ్‌తో 90-160 కిలోమీటర్ల వరకు ప్రయాణించే కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇది రోజువారీ నగర ప్రయాణాలకు సరిపోతుంది. ఎక్కువ ఛార్జింగ్ పాయింట్ ఇంకా అందుబాటులోకి రావలసి ఉంది కాబ్బటి దూర ప్రయాణాలకుపెట్రోల్ బైక్‌లు బెస్ట్ గా నిలుస్తున్నాయి.
Read more news like this on telugu.timesnownews.com

