BYD సంస్థ రూపొందించిన SEAL కారు ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్, పర్యావరణహితమైన పెర్ఫార్మన్స్ తో ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
చైనాలో ప్రారంభమైన ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. శక్తివంతమైన బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం, స్మార్ట్ ఫీచర్లతో ఇది కొత్త తరానికి సరిపోయే విధంగా రూపొందించారు . SEAL కారు ప్రయాణంతో పాటు కంఫర్ట్ , సేఫ్టీ , పవర్ ని అందించే ఎలక్ట్రిక్ వాహనంగా నిలుస్తుంది.
BYD Seal ఎలక్ట్రిక్ సెడాన్ కారు
BYD Seal భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఎలక్ట్రిక్ సెడాన్. ఇది లగ్జరీ, సేఫ్టీ, హై-పర్ఫార్మెన్స్‌ను అందించే వాహనంగా Teslaగ్లోబల్ EVలకు పోటీగా నిలుస్తోంది. ఈ కారు బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ తో ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షితమైన బ్యాటరీగా గుర్తింపు పొందింది. 0% నుండి 80% వరకు కేవలం 45 నిమిషాల్లో DC ఫాస్ట్ ఛార్జ్ ద్వారా ఛార్జ్ అవుతుంది. 15 నిమిషాల ఛార్జ్‌తో 200 km వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ప్రీమియం వేరియంట్‌లో 650 km రేంజ్ అందిస్తుంది .
ఈ బ్యాటరీ 5-10 లక్షల km వరకు లైఫ్‌స్పాన్ కలిగి ఉంటుంది.BYD Seal 0-100 km/h వేగాన్ని కేవలం 3.8 సెకన్లలో చేరుతుంది. iTAC (Intelligence Torque Adaption Control) సిస్టమ్ వాహనాన్ని మరింత స్థిరంగా, సురక్షితంగా నడిపేలా చేస్తుంది. Moose Testలో 83.5 km/h పెర్ఫార్మన్స్ ర సాధించింది.
ఫీచర్స్
ఫీచర్లలో 15.6- ఇంచ్ రొటేటింగ్ టచ్ స్క్రీన్ 10.25- ఇంచ్ LCD డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, పానోరామిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ & హీటెడ్ సీట్స్, ఫ్రంట్ ట్రంక్ (53L) + రేర్ బూట్, Vehicle-to-Load (V2L) ఫీచర్స్ ఉన్నాయి.
సేఫ్టీ PARAMGA Cell-to-Body టెక్నాలజీ కార్ బాడీని స్ట్రాంగ్ గా చేస్తుంది. ADAS (Advanced Driver Assistance System) డ్రైవింగ్‌కి సేఫ్టీ ని అందిస్తుంది.రైన్ సెన్సింగ్ వైపర్లు, యాంటి -పించ్ టెయిల్ గేట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
BYD Seal కు 8 సంవత్సరాల లేదా 1.6 లక్షల km వరకు బ్యాటరీ వారంటీ, 6 సంవత్సరాల లేదా 1.5 లక్షల km వరకు వాహన వారంటీ అందుబాటులో ఉంది. BYD ఇండియా 150 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తోంది.దీని ద్వారా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. Dynamic (510 km రేంజ్), Premium (650 km రేంజ్), Performance AWD (580 km రేంజ్). వీటి ఉన్నాయి.
వేరియంట్ ధరలు
DYNAMIC వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹41 00 000/-
PREMIUM వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹45 70 000/-
PERFORMANCE వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹53 15 000/-
Read more news like this on telugu.timesnownews.com

