టాటా మోటార్స్ తన ప్రజాదరణ పొందిన టియాగో మోడల్‌ను కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌గా విడుదల చేసింది. ఈ కొత్త టియాగో EV డిజైన్ లో ఆధునికతను అందిస్తూ స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, క్లోస్డ్ గ్రిల్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్ లాంటివి దీనికి స్టైలిష్ లుక్‌ను ఇస్తున్నాయి .
వెనుక భాగంలో గ్లోస్-బ్లాక్ యాక్సెంట్, కొత్త బంపర్, స్పాయిలర్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ కార్ కు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.ఇంటీరియర్‌లో కూడా టాటా లేటెస్ట్ డిజైన్ అందించింది . కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, డ్యూయల్ టోన్ థీమ్, ఫ్లోటింగ్-స్టైల్ స్క్రీన్, రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ లాంటివి కేబిన్‌ను ప్రీమియం ఫీల్ కలిగించేలా ఉన్నాయి . వినియోగదారుల కంఫర్ట్ కోసం సెంటర్ కన్సోల్‌ను లేటెస్ట్ డిజైన్ అందించారు .టాటా టియాగో EV 2026 తన కొత్త లుక్ , లేటెస్ట్ ఇంటీరియర్, భద్రతా ప్రమాణాలతో భారతీయ వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అనుభవాన్ని అందించనుంది.
టాటా టియాగో EV 2026
టాటా టియాగో EV 2026 మోడల్ భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆధునిక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో 19 kWh , 24 kWh అందుబాటులో ఉంది. చిన్న బ్యాటరీ ప్యాక్ రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్‌ను ఇస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఎక్కువ రేంజ్‌తో పాటు లైఫ్‌టైమ్ వారంటీని కలిగి ఉంటుంది. ఈ కారు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో మంచి పవర్ , టార్క్ ను అందిస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని స్మూత్‌గా ఉండేలా అందిస్తుంది . ARAI సర్టిఫైడ్ రేంజ్ 225-293 km వరకు ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ 120 kmph.
ఫీచర్స్
డిజైన్ పరంగా టాటా టియాగో EV కొత్త తరహా LED DRL హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, గ్లోస్-బ్లాక్ యాక్సెంట్స్‌తో స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంది.
ఇంటీరియర్‌లో ఆధునిక డాష్‌బోర్డ్, డ్యూయల్ టోన్ థీమ్, 26.03 cm HD టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే& ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ , ఫుల్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఉంటయి . 360° కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, iRA.ev కనెక్టివిటీతో 40+ కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి.సస్పెన్షన్‌లో ఫ్రంట్ మెక్‌ఫర్సన్ స్ట్రట్, రియర్ ట్విస్ట్ బీమ్ ఉన్నాయి .
బ్రేకింగ్ సిస్టమ్‌లో ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ద్వారా కేవలం 18 నిమిషాల్లో 100 km రేంజ్ అందిస్తుంది . ఆరు డ్యూయల్ టోన్ రంగులలో వస్తుంది . వేరియంట్స్‌లో Smart, Pure, Creative అందుబాటులో ఉన్నాయి.
ధరలు
Smart 19 వేరియంట్ హైదరాబాద్ షో రూమ్ ధర ₹6,99,000/-
Pure+ 19 వేరియంట్ హైదరాబాద్ షో రూమ్ ధర ₹8,49,000/-
Pure+ 24 వేరియంట్ హైదరాబాద్ షో రూమ్ ధర ₹9,49,000/-
Creative+24 వేరియంట్ హైదరాబాద్ షో రూమ్ ధర ₹9,99,000/-
టాటా టియాగో EV 2026 ఆధునిక డిజైన్, కంపార్ట్ , భద్రతా ప్రమాణాలు, పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో భారతీయ వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించనుంది .
Read more news like this on telugu.timesnownews.com

