8 April 2026 Rasi Phalalu: నేడు బుధవారం, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:09 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:27 గంటలకు జరుగును.
షష్ఠి తిథి రాత్రి 7:01 వరకు కొనసాగి, అనంతరం సప్తమి తిథి ప్రారంభమగును. మూల నక్షత్రం ఉదయం 8:42+ వరకు ఉండి, తరువాత పూర్వాషాఢ నక్షత్రం ప్రవేశిస్తుంది. వారియ యోగం సాయంత్రం 5:03 వరకు కొనసాగుతుంది. వర్జ్యం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:39 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:50 వరకు కొనసాగుతుంది. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 1:42 నుండి తెల్లవారుజామున 3:30 వరకు శుభప్రదంగా ఉంటాయి. ఇక్కడ "+" గుర్తు ఉన్న సమయాలు మరుసటి రోజునకు చెందినవిగా గ్రహించాలి.
మేష రాశి:
ఈ రోజు మీకు ఊహించని ఖర్చులు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ వీసాలకోసం చేసే పనులు ప్రారంభించడానికి నేడు అనుకూలం. ఈ రోజు పెట్టిన పెట్టుబడులపై వెంటనే ఫలితాలు, లాభాలు ఆశించకండి. మానసికంగా కొంచెం ఆందోళన పెరుగుతుంది, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో, పిల్లల చదువులు, వివాహాల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ సహనంతో పని చేయటం అవసరం. హనుమంతుడి ఆరాధన మీకు శుభాలను కలిగిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు | లక్కీ నంబర్: 3
వృషభ రాశి
వ్యాపారులకు స్నేహితుల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు, ఆర్డర్లు లభిస్తాయి. వ్యాపార ఆదాయాలు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉండటంతో ఆందోళన అధికమవుతుంది. కొత్త పెట్టుబడుల కోసం మీరు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు పెద్దగా మార్పులేమీ లేకపోయినా రోజు మాత్రం ప్రశాంతంగా గడుస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవి దర్శనం, ప్రార్ధన మీకు శుభాలను కలిగిస్తుంది.
లక్కీ కలర్: ఆకుపచ్చ | లక్కీ నంబర్: 6
మిథున రాశి
8 April 2026 Rasi Phalalu బట్టి చూస్తే నేడు మిథున రాశి ఉద్యోగస్తులకు నేడు కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా ఎదగడానికి కొన్ని ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి ఉద్యోగ నియామక పత్రాలు అందుకునే అవకాశాలున్నాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో తండ్రి లేదా పెద్దల సహాయం లభిస్తుంది. వ్యాపారులకు లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి ఆర్థికలాభాలను అందిస్తాయి. విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలను కలిగిస్తుంది.
లక్కీ కలర్: పసుపు | లక్కీ నంబర్: 5
కర్కాటక రాశి
దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. విద్యార్థులకు చదువుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దల గురువుల ఆశీస్సులు మీకు మంచి చేస్తాయి. తలపెట్టిన పనుల్లో కొంత ఆలస్యం జరిగినా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు లభించడంతో ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. గణపతి స్వామి దర్శనం, గరిక పూజ మీకు శుభాలను కలిగిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు | లక్కీ నంబర్: 2
సింహ రాశి
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం తక్కువ, ఖర్చులు అధికంగా ఉండే అవకాశముంది. వ్యాపారులు తన రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఆర్థికపరమైన విషయాల్లో ఎవరిపైనా ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నేడు మీరు తలపెట్టే పనులను పూర్తయ్యేవరకు జీవిత భాగస్వామితో కూడా చెప్పకండి. హనుమంతుడికి సింధూరాన్ని సమ్పరించండి. శుభాలు కలుగుతాయి.
లక్కీ కలర్: నారింజ | లక్కీ నంబర్: 5
కన్య రాశి
నేడు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది చాలా అనుకూలమైన రోజు. వ్యాపారులు లాభదాయకమైన నూతన ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. బందుమిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగులు అనవసర వాదనలు, చర్చలకు దూరంగా ఉంటూ పని పై శ్రద్ద పెట్టండి. అమ్మవారి ఆరాధన మీకు రోజును మరింతగా సానుకూలంగా మారుస్తుంది.
లక్కీ కలర్: గులాబీ | లక్కీ నంబర్: 7
రామకోటి ఎలా రాయాలి? నియమాలు ఏమిటి? పాటించాల్సిన పద్ధతులు ఇవే!
తుల రాశి:
ఈ రోజు మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారులకు పోటీ అధికంగా ఉంటుంది. కస్టమర్లు చేజారిపోవడం, రావాల్సిన ఆర్డర్లు పోటీదారుల వశమవడం మీకు ఆందోళన కలిగిస్తుంది. మీ మాట తీరులో కాఠిన్యాన్ని తగ్గించుకుని నలుగురిని కలుపుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు సాధారణమైన రోజు. అన్ని వర్గాల వారు నేడు క్రమశిక్షణ తో ఉండటం చాలా అవసరం. జీవిత భాగస్వామికి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి. దుర్గాదేవికి ఎర్రటి పూలతో అర్చన చేయండి. ఇబ్బందులు తొలగుతాయి.
లక్కీ కలర్: నారింజ | లక్కీ నంబర్: 9
వృశ్చిక రాశి
మీడియా, సినిమా వంటి రంగాల్లో పని చేసేవారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు సమాజంలో, పార్టీ పరంగా విలువ పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వ్యాపారులు నలుగురు వెళ్లే దారిలో కాకుండా విభిన్నంగా అలోచించి మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారాల ప్రచారం విషయంలో కొత్త పుంతలు తొక్కుతారు. వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిచండి. విజయాలు కలుగుతాయి.
లక్కీ కలర్: గంధం | లక్కీ నంబర్: 4
ధనుస్సు రాశి
ఈ రోజు మీలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఈ రోజు దూరంగా ఉండండి. అందరు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు అనే భావనతో మీరు బాధపడతారు. కానీ మీ మాట తీరువల్లే అలా జరుగుతుందని గుర్తించండి. కుటుంబ విషయాలపై శ్రద్ద పెట్టండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శ్రీరామ ఆపదుద్ధారక మంత్రం పారాయణ మీకు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
లక్కీ కలర్: పసుపు | లక్కీ నంబర్: 8
మకర రాశి
ఈ రోజు అనుకోని ప్రయాణాలు చేయవలసి రావొచ్చు. మీరు చేసేది తప్పు, వారు చేసేదే సరైనది అనే ధోరణిలో ఉండే కుటుంబ సభ్యులతో మీకు తలనొప్పులు పెరుగుతాయి. సోదరుల ఆధిపత్య ధోరణి మీకు అసహనాన్ని కలిగిస్తుంది. మౌనంగా ఉండండి. వ్యాపారపరమైన కొత్త పనులు ప్రారంభించడానికి నేడు అనుకూలమైన రోజు. అయితే స్పెక్యులేషన్లను మాత్రం దూరంగా ఉండండి. గణపతి ఆరాధన మీరు తలపెట్టిన పనుల్లో విఘ్నాలను తొలగిస్తుంది.
లక్కీ కలర్: పసుపు| లక్కీ నంబర్: 5
కుంభ రాశి
ఈ రోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు కలిసి రావడంతో మంచి ఆర్థికలాభాలు అందుకుంటారు. అయితే మీ మాటలకు రకరకాల అర్థాలు తీసేవారితో జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేడు అద్భుతంగా గడుస్తుంది. ఇబ్బంది పెడుతున్న కొన్ని వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహంలోకి విలువైన వస్తువులు, ఖరీదైన గాడ్జెట్లు కొనుగోలు చేస్తారు. శివారాధన మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది.
లక్కీ కలర్: నీలం | లక్కీ నంబర్: 9
మీన రాశి
నేడు గ్రహాల ప్రభావం మీకు కొంత మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఆర్థికపరమైన నిర్ణయాల్లో కొంత అప్రమత్తత అవసరం. ముఖ్యమైన విషయాలను జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోండి. మధ్యవర్తుల సహకారంతో కొన్ని భూ వివాదాలను పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. డబ్బు విషయంలో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. గణపతి దర్శనం మీకు తలపెట్టిన పనుల్లో దారి చూపిస్తుంది.
లక్కీ కలర్: పాలపిట్ట రంగు | లక్కీ నంబర్: 4
కష్టాల నుండి విముక్తిని ప్రసాదించి అదృష్టాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ స్వామి తోక పూజ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.
Read more news like this on telugu.timesnownews.com

