Touche ఎలక్ట్రిక్ సైకిల్స్ రవాణా రంగంలో పర్యావరణహితమైన ప్రయాణానికి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే లా నగర జీవనశైలికి సరిపోయేలా రూపొందించారు .
ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ సౌకర్యవంతమైన డిజైన్, లాంగ్ రన్ బ్యాటరీ, స్మార్ట్ టెక్నాలజీ తో ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు, ఇంధన వ్యయం, కాలుష్యాన్ని తగ్గించడంలో Touche ఎలక్ట్రిక్ సైకిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువత, ఉద్యోగులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి సరైన ఎంపిక. ఈ సైకిల్స్ వినియోగదారులకు కంపార్ట్ , వేగం, పర్యావరణ పరిరక్షణ అందిస్తూ మంచి జీవనశైలికి బెస్ట్ ఎంపిక.
Touche Heileo M100 ఎలక్ట్రిక్ సైకిల్
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఆధునిక రవాణా రంగంలో ఒక ప్రత్యేకమైన మోడల్‌గా నిలుస్తోంది. ఇది మౌంటెన్ బైక్ స్టైల్‌లో రూపొందించబడిన ఎలక్ట్రిక్ సైకిల్ నగర ప్రయాణం , ఆఫ్-రోడింగ్ రెండింటికీ అనువైనది. ఇది డిటాచబుల్ లిథియమ్-అయాన్ బ్యాటరీ తో వస్తుంది . ఇది రెండు వేరియంట్లలో 9.6Ah (345 Wh), 12.8Ah (460 Wh) లభిస్తుంది .ఈ బ్యాటరీలు సులభంగా ఛార్జ్ చేయగలిగే విధంగా రూపొందించారు . 3.5-4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతాయి. పెడల్ అసిస్ట్ మోడ్‌లో ఈ సైకిల్ 60-80 km రేంజ్ ఇస్తుంది. థ్రాటిల్ మోడ్‌లో రేంజ్ సుమారు 40% తగ్గుతుంది. భారతీయ రోడ్డు నియమాలకు అనుగుణంగా దీని టాప్ స్పీడ్ 25kmph ఉంటుంది.
ఫీచర్స్
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో 250W హబ్ మోటార్, 5-లెవల్ పవర్ అసిస్ట్, అడాప్టివ్ కంట్రోలర్ యూనిట్ ఉన్నాయి. ఇవి బ్యాటరీ, మోటార్, పెడల్స్, థ్రాటిల్, బ్రేక్స్ నుండి సిగ్నల్స్ తీసుకుని పెర్ఫార్మన్స్ ను ఆప్టిమైజ్ చేస్తాయి.దీనిలో ఇంకా వాక్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది.
సౌకర్యవంతమైన ప్రయాణం కోసం 60mm సస్పెన్షన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, 7-స్పీడ్ షిమానో గియర్స్ ఉన్నాయి . LCD డిస్‌ప్లే ద్వారా రైడర్‌కు అవసరమైన సమాచారం అందిస్తుంది .ఈ సైకిల్ బరువు 21.8 kg, హై లోడ్ కెపాసిటీ 110 kg. టైర్స్ 27.5 ఇంచ్ స్పోక్ వీల్స్ తో వస్తాయి. ఇది రెండు రంగులలో స్ప్రింగ్ గ్రీన్ , పోర్ట్ ల్యాండ్ ఆరంజ్ లలో వస్తుంది
ధర
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధరలు ₹46,990 నుండి ₹50,990 వరకు ఉన్నాయి.
345 Wh బ్యాటరీ వేరియంట్ తక్కువ బరువు, సాధారణ ప్రయాణాలకు బెస్ట్ గా ఉంటుంది. 460 Wh బ్యాటరీ వేరియంట్ ఎక్కువ రేంజ్, దూర ప్రయాణాలు , ఆఫ్-రోడింగ్‌కు అనువైనది. పర్యావరణహితమైన రవాణా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం, ఆధునిక టెక్నాలజీ కలయికతో Heileo M100 ఎలక్ట్రిక్ సైకిల్ యువత, ఉద్యోగులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి సరైన ఎంపికగా నిలుస్తుంది.
Read more news like this on telugu.timesnownews.com

