కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేయగా, త్వరలోనే ఒక కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణల పైన కీలక నిర్ణయం తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
ఇందులో భాగంగా 18 నెలల పాటు 8వ పే కమిషన్ పనిచేయనుంది.
అయితే తాజాగా ఏప్రిల్ 30వ తేదీలోగా ఉద్యోగ సంఘాల వారు ఉద్యోగులు ఎవరైనా ఎనిమిదో పే కమిషన్‌కు తమ విజ్ఞప్తులను పంపే అవకాశం కల్పించింది. అయితే తాజాగా రక్షణ రంగానికి చెందిన సివిలియన్ ఉద్యోగ సంఘం భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సాంగ్ (బిపిఎంఎస్) తాజాగా 8వ పే కమిషన్‌కు ఒక మెమోరాండం సమర్పించింది.
ఇందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి కనిష్ట బేసిక్ వేతనం 72 వేల రూపాయలకు పెంచాలని బిపిఎంఎస్ డిమాండ్ చేసింది. తద్వారా గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను అందుకునేందుకు ఈ మొత్తం ఉద్యోగులకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. బిపిఎంఎస్ పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎనిమిదో పే కమిషన్‌కు బిపిఎంఎస్ సమర్పించిన మెమొరండంలోని ముఖ్యమైన అంశాలు ఇవే.
బేసిక్ వేతనం 72000 రూపాయలకు పెంచాలని డిమాండ్ :
8వ పే కమిషన్ కనిష్ట బేసిక్ వేతనం 72 వేల రూపాయలకు పెంచాలని బిపిఎంఎస్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ప్రస్తుతం 18 వేల రూపాయల వద్ద ఉన్నటువంటి కనీస వేతనం 72 వేల రూపాయలకు పెంచడం ద్వారా ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తన మెమోరాండంలో పేర్కొంది.
అంతేకాదు, తలసరి ఆదాయం పెరుగుదలకు కూడా ప్రస్తుతం ప్రతిపాదించిన 72 వేల రూపాయలు కనుక నిర్ణయిస్తే న్యాయవంతమైన, హేతుబద్ధమైన కోరిక అవుతుందని ఈ సందర్భంగా యూనియన్ పేర్కొంది. ప్రస్తుతం దేశ తలసరి నికర ఆదాయం ఆధారంగా కనిష్ట వేతనాన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 4.0 కు పెంచాలని డిమాండ్:
ప్రస్తుతం 2016-17 నుంచి 2024-25 మధ్యకాలంలో దేశ తలసరి నికర జాతీయ ఆదాయం 86.76 శాతం పెరిగిందని, దీన్ని ప్రాతిపదికగా తీసుకొని జీతాలను పెంచాలని ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాదు, ఉద్యోగుల వేతన సవరణలో అత్యంత కీలకమైనటువంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ప్రస్తుతం ఉన్న 18 వేల రూపాయల కనిష్ట బేసిక్ వేతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని ఈ సందర్భంగా కోరినట్లు చూడవచ్చు. తద్వారా ద్రవ్యోల్బణం అలాగే ఆదాయ వృద్ధికి కూడా ఇది సమన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఉన్నటువంటి మూడు శాతం వార్షిక ఇంక్రిమెంట్ విధానాన్ని ఆరు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని కూడా పే కమిషన్‌కు సంఘం డిమాండ్ చేసింది. ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయం అలాగే ప్రైవేటు రంగంలో మారుతున్న ట్రెండ్స్ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
దీంతోపాటు పే కమిషన్ ప్రస్తుతం ఒక కుటుంబానికి ముగ్గురిని మాత్రమే యూనిట్‌గా భావిస్తుందని, అయితే ప్రస్తుతం దీనిని 5 యూనిట్లకు పెంచాలని ఉద్యోగి తన భార్య, పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా పోషించాల్సిన బాధ్యత ఉంటుందని దీన్ని గుర్తించాలని పే కమిషన్‌కు తన మెమొరండంలో బీపీఎమ్ఎస్ పేర్కొంది.
Read more news like this on telugu.timesnownews.com

