Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...ఏకంగా 16 నెలల ఎరియర్స్ లభించే అవకాశం...భారీగా పెరగనున్న వేతనం...ఇక పండగే...

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...ఏకంగా 16 నెలల ఎరియర్స్ లభించే అవకాశం...భారీగా పెరగనున్న వేతనం...ఇక పండగే...

Times Now Telugu 1 week ago

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతన సవరణల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ వేతన సంఘం ఇప్పటికే ఆరు నెలలుగా తమ పనితీరు ప్రారంభించింది.

కాగా మరో 12 నెలల్లో కమిటీ కేంద్ర ప్రభుత్వానికి వేతన సవరణ సిఫార్సులను అందజేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేతన సంఘం చేసే సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల మనసుల్లో మెదులుతున్న అత్యంత కీలకమైన ప్రశ్న ఏమిటంటే, కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత, తమకు చెల్లించాల్సిన బకాయిలను (arrears) ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు. 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 2025తో ముగిసింది. కొత్త నిబంధనల ప్రకారం, జనవరి 1, 2026 నుండి పెరిగిన జీతాల ఆధారంగా ఉద్యోగులు తమ బకాయిలను పొందుతారని భావిస్తున్నారు.

వేతన సంఘం తన తుది నివేదికను సమర్పించడానికి మే 2027 వరకూ సమయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. నివేదిక సమర్పించిన తర్వాత, మంత్రివర్గ ఆమోదం, అధికారిక ప్రకటన వెలువడటానికి మరో 3 నుండి 6 నెలల సమయం పట్టవచ్చు. ఉద్యోగులు సుమారు 20 నుండి 24 నెలల కాలానికి సంబంధించిన భారీ మొత్తంలో ఎరియర్స్ బకాయిలను పొందే అవకాశం ఉంది. అయితే ఈ బకాయిలను కేవలం Basic Pay పై లెక్కిస్తారా లేక మొత్తం వేతనం పైన లెక్కిస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు బేసిక్ వేతనంలో పెంపుదల ఉంటే, అది ఇతర భత్యాల పెరుగుదలకు దారి తీస్తుంది. నిజానికి నవంబర్ 2025లో, కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి తన తుది నివేదికను రూపొందించి సమర్పించడానికి 18 నెలల సమయాన్ని మంజూరు చేసింది. కమిషన్ సిఫార్సులు చేయడానికి మే 2027 వరకు గడువు ఉంది.

8వ వేతన సంఘం తుది నివేదిక సమర్పించిన తర్వాత, కేంద్ర మంత్రుల బృందం దానిని సమీక్షిస్తుంది, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆ ముసాయిదాకు తుది ఆమోదం తెలుపుతుంది. ఈ మొత్తం పరిపాలనా ప్రక్రియకు అదనంగా మరో 3 నుండి 6 నెలల సమయం పడితే, కొత్త వేతన సంఘం సిఫార్సులు బహుశా 2027 చివర్లో మాత్రమే పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త వేతన నిర్మాణం జనవరి 1, 2026 నుండి నుండి అమల్లోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది కాబట్టి ఇది చివరకు అమలు అయ్యే సమయానికి ఉద్యోగుల ఖాతాల్లోకి 20 నుండి 24 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు నేరుగా జమ అయ్యే బలమైన అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఎక్కువగా వేతన సవరణ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నాయి పలు సంఘాలు 3.0 కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu