Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి సుచి యాష్కీకి యాక్సిడెంట్

అమెరికాలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి సుచి యాష్కీకి యాక్సిడెంట్

Times Now Telugu 1 week ago

కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ భార్య డాక్టర్ సుచీ యాష్కీ కారుకు ప్రమాదం జరిగింది. అమెరికాలో సుచీ యాష్కీ ప్రముఖ వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

మధుయాష్కీ స్థాపించిన మధు యాష్కీ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఆరోగ్యసంరక్షణ సేవలు అందించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం కుమార్తె గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. బోస్టర్ నుంచి న్యూయార్క్ వస్తుండగా వర్షం కారణంగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె రిబ్స్ విరిగినట్లు తెలుస్తోంది.

మధుయాష్కీ గౌడ్ సతీమణి సుచి యాష్కీ కారుకు ప్రమాదం

అమెరికాలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి సుచీ యాష్కీ కారుకు ప్రమాదం జరిగింది. మధు యాష్కీ, సుచి యాష్కీల ముద్దుల కుమార్తె గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. బోస్టన్ నుంచి న్యూయార్క్ వస్తుండగా వర్షం కారణంగా కారు అదుపుతప్పి కారు పల్టీలు కొట్టింది. ప్రమాదం సమయంలో మధుయాష్కీ గౌడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లగేజీ ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీ గౌడ, సుచియాష్కీ గౌడ్ వేర్వేరు కార్లలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుచి యాష్కీ గౌడ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గురువారం మధుయాష్కీ దంపతులు ఇండియాకు తిరిగిరావాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu