Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP Weather Update: రేపు ఏపీలో 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు... 64 మండలాల్లో వడగాల్పులు,  ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు

AP Weather Update: రేపు ఏపీలో 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు... 64 మండలాల్లో వడగాల్పులు, ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు

Times Now Telugu 2 weeks ago

రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఇకపోతే శనివారం 11 మండలాల్లతో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే నైరుతి రుతు పవానాల ప్రభావంతో శనివారం రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకావం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.ఇకపోతే శుక్రవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి.

☀️మే 30 శనివారం

శనివారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

▪️ పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 - 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

▪️విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 - 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

▪️శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 40 - 42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు
మరోవైపు నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీనిప్రభావంతో శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

కొమ్మిపాడులో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు
శుక్రవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.6 డిగ్రీలు, మన్యం జిల్లా భామిని, విజయనగరం జిల్లా రాజాంలో 43.9 డిగ్రీలు, ప్రకాశం(జి) కారేడు, తిరుపతి(జి) వెంకటగిరిలో 43.8 డిగ్రీలు, శ్రీకాకుళం(జి) లక్ష్మీనరసుపేటలో 43, బాపట్ల(జి) కూచినపూడి, పోలవరం(జి) దేవిపట్నంలో 42.1 డిగ్రీలు, ఏలూరు(జి) కుక్కునూరులో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 10 జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్‌లో:

https://apsdma.ap.gov.in/files/2de1ba6d0098cccd12f140972c9376de.pdf

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu