Dailyhunt
అసెంబ్లీకి ఆటోడ్రైవర్: తమిళనాడులో టీవీకే పార్టీ అభ్యర్థి విజయ్ ధాము సంచలన విజయం... మాజీమంత్రిని మట్టికరిపించిన సామాన్యుడు

అసెంబ్లీకి ఆటోడ్రైవర్: తమిళనాడులో టీవీకే పార్టీ అభ్యర్థి విజయ్ ధాము సంచలన విజయం... మాజీమంత్రిని మట్టికరిపించిన సామాన్యుడు

Times Now Telugu 1 week ago

మిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అన్నీ సంచలనాలే నమోదు అవుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా టీవీకే పార్టీ సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. పార్టీ స్థాపించిన రెండేళ్ల రెండు నెలలకే అధికారంలోకి వచ్చింది టీవీకే.

మరోవైపు విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. పార్టీ, అధినేత ఇలా వరుస విజయాలు సాధించడం ఒక ఎత్తు అయితే విజయ్ నిలబెట్టిన అభ్యర్థులు నమోదు చేస్తున్న విజయాలు సైతం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. అంతేకాదు రాజకీయ ఉద్దండులను టీవీకే పార్టీ అభ్యర్థులు ఓడించి జెయింట్ కిల్లర్స్‌గా నిలుస్తున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల నుంచి వరుస విజయాలు సాధిస్తున్న నేతలను టీవీకే అభ్యర్థులు అందులోనూ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లు ఓడించడం తమిళనాడు కాదుకాదు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా చెప్పుకోవచ్చు.

సంచలనాలను సృష్టించిన టీవీకే అభ్యర్థులు
టీవీకే అధినేత, హీరో విజయ్ రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2026 ఎన్నికలే టార్గెట్ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి సామాన్యులకు టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దాదాపు 12 మంది సామాన్యులకు ఈసారి టికెట్లు ఇచ్చారు హీరో విజయ్.ఇలా ఎన్నికల బరిలో నిలిచిన సామాన్యులు ఘన విజయం సాధించారు. అలాంటి వారిలో ఆటో డ్రైవర్ కె. విజయ్ ధాము ఒకరు. ఇద్దరు బలమైన నేతలను ఓడించి అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు ధాము. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ రాయపురం అభ్యర్థిగా విజయ్ ధామును ఖరారు చేసింది. దీంతో విజయ్ ధాము ఎన్నికల ప్రచారం వినూత్నంగా నిర్వహించారు.

దిగ్గజాలను ఓడించిన విజయ్ ధాము
రాయపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటేనే ఏఐఏడీఎంకేకు కంచుకోట. ఇంకా చెప్పాలంటే AIADMK సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌కు సొంత అడ్డా.1991 నుంచి జయకుమార్ అక్కడ నుంచే వరుసగా గెలుపొందుతున్నారు. అలాంటి జయకుమార్‌ను కే విజయ్ ధాము మట్టికరిపించారు. తొలిసారి పోటీతోనే మూడో స్థానానికి నెట్టేయడం విశేషం. AIADMK తరుఫున పోటీలో నిలిచిన జయకుమార్ కేవలం 18,000 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే డీఎంకే తరఫున బరిలో నిలిచిన సుబైర్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయ్ ధాము 55,000 పైచిలుకు ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి అయిన సుబైర్ ఖాన్‌పై 14,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి అసెండ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

మక్కల్ ఇయ్యక్కం సభ్యుడు

ఇకపోతే విజయ్ దాము బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే విజయ్ మక్కల్ ఇయక్కం (అభిమాన సంఘం)లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. అభిమాన సంఘాల తరఫున ప్రజలతో మమేకమవుతుండేవాడు. ప్రజల్లో ఉండటమే విజయ్ దాముకు ఈ ఎన్నికల్లో కలిసివచ్చింది. అంతేకాదు అభ్యర్థి ప్రకటన సమయంలో కూడా పార్టీ అధినేత విజయ్‌ని దాము కౌగిలించుకుని కంటతడి పెట్టిన ఫొటో కూడా విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీ 'సామాన్యుడి గొంతుక' అనే నినాదానికి ఓ ప్రతీక అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది.'మీరు మమ్మల్ని కొత్త ముఖాలు అని అనొచ్చు. కానీ మేము మా అభిమాన సంఘాల ద్వారా ఏళ్ల తరబడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం' అంటూ విజయ్ ధాము వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో టీవీకే అధినేత విజయ్‌ని కౌగిలించుకుని విజయ్ ధాము కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం...ఇప్పుడు ఆ పార్టీ సాధించిన అద్భుత విజయానికి ప్రతీకగా మారింది. తీరప్రాంత నియోజకవర్గమైన రాయపురం కోసం విజయ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో మత్స్యకార సమాజానికి పెద్దపీట వేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత కల్పిస్తామన్న హామీ స్థానిక ఓటర్లలో బలమైన ముద్ర వేసింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu